జామపండును తింటే ఆ సమస్యలు తగ్గుతాయట.. అవి ఏంటో తెలుసా?

First Published Jan 16, 2022, 4:01 PM IST

జామపండులో (Guava) ఎన్నో పోషకాలు ఉంటాయి. జామపండు అన్ని కాలాలలోనూ చౌకగా దొరుకుతాయి. ఇది శరీరానికి శక్తిని అందించి  వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది శరీరానికి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతుంది. కనుక జామపండును తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు మనం జామపండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
 

జామపండులో అనేక ఔషధ గుణాలు (Medicinal properties) ఉంటాయి.  తోపాటు జామ ఆకులలో కూడా అనేక పోషకాలు (Nutrients) ఉంటాయి. జామపండులో విటమిన్ సి, విటమిన్ ఏ, లైకోపిన్, పీచు పదార్థం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

జామ పండును ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు (Salt), కారం (Chili) వేసుకుని తింటే అబ్బబ్బబ్బా దాని రుచి భలే అమోహం. ఇది రుచితో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. జామపండులో నేరుగా అయినా తినవచ్చు, జామ జ్యూస్ అయినా తాగవచ్చు. జామ పండును శరీరానికి ఏదో ఒక విధంగా అందించడం ముఖ్యం.
 

క్యాన్సర్ ను తగ్గిస్తుంది: జామ పండులో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. ఫలితంగా క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ (Cancer) నివారిణిగా సహాయపడుతుంది. కనుక జామకాయలను తినడం ఆరోగ్యానికి మంచిది.
 

జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది: జామకాయలు పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను (Digestive process) మెరుగుపరిచే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. దీంతో మలబద్దకం సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
 

నెలసరి సమస్యలు తగ్గుతాయి: నెలసరి సమయంలో చాలామంది మహిళలు డిస్మెనోరియాతో (Dysmenorrhea) బాధపడుతుంటారు. అలాంటి వారు జామకాయలు పండ్లను తరచూ తింటే శరీరానికి కావలసిన పోషకాలు అంది నెలసరి సమస్యలు (Monthly issues) తగ్గుతాయి.

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది: వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు రోజూ ఒక పండు తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) శరీరానికి కావలసిన శక్తిని అందించే వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి  వ్యాధినిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి.

మధుమేహం సమస్యలు తగ్గుతాయి: జామకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ (Insulin resistance) గుణం పుష్కలంగా ఉంటుంది. దీనికి రక్తంలోని స్థాయిల్ని సమన్వయం చేసే శక్తి ఎక్కువ. కనుక మధుమేహం (Diabetes) నుంచి దూరంగా ఉండడానికి వీలైతే జామ ఆకుల్ని తినడం మంచిది.
 

రక్తపోటు అదుపులో ఉంటుంది: జామకాయలు సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును (Blood pressure) అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. కనుక రోజూ ఒక జామ పండు తింటే ఆరోగ్యానికి (Health) మంచిది.

కంటి చూపు మెరుగుపడుతుంది: జామకాయలో విటమిన్ ఎ (Vitamin A) పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరిచి కంటి సమస్యలు (Eye problems) రాకుండా కాపాడుతుంది. కనుక రోజు ఒక జామ పండు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీలకు మంచిది: జామకాయలో ఫోలిక్ యాసిడ్ (Folic acid) పుష్కలంగా ఉంటుంది. కనుక గర్భిణీలు (Pregnant women) జామకాయను తినడం మంచిది. ఇందులో ఉండే పోషకాలు తల్లి ఆరోగ్యంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.

click me!