US Garden Rules: అమెరికాలో గార్డెన్‌లో ఈ పనులు చేస్తే...భారీ జరిమానా కట్టాల్సిందే

Published : May 16, 2026, 12:47 PM IST

US Garden Rules: మనకు నచ్చినట్లు ఇంట్లో మొక్కలు నాటుకోవడం, తోట పెంచుకోవడం మన దేశంలో మామూలే. కానీ అమెరికాలో మాత్రం గార్డెనింగ్ చేయడానికి కొన్ని కఠిన చట్టాలు ఉన్నాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. రూల్స్ పాటించకపోతే మాత్రం ఫైన్ కట్టాల్సిందే. 

PREV
15
అమెరికాలో గార్డెనింగ్ చేయాలంటే ఎన్ని రూల్సో తెలుసా?

మనలో చాలామందికి ఇంటి పెరట్లో మొక్కలు పెంచుకోవడం, తోట వేసుకోవడం చాలా ఇష్టం. అలా సాయంత్రం పూట నీళ్లు పోస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తారు. అదొక ప్రశాంతమైన వాతావరణం కూడానూ. కానీ అమెరికాలో మాత్రం గార్డెన్ల విషయంలో చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. ఇల్లు అందంగా కనిపించడం కోసమే కాదు.. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ, ఎదురింటి, పక్కింటి వాళ్ల సౌకర్యం, అగ్ని ప్రమాదాల దృష్ట్యా ఈ రూల్స్ పెట్టారంటా. 

తెలియక చేసే చిన్న తప్పుల వల్ల కూడా అక్కడ నోటీసులు, భారీ జరిమానాలు, కొన్నిసార్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికాలో గార్డెనింగ్‌కు సంబంధించి పాటించాల్సిన ఆ ముఖ్యమైన నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

25
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు

మనం మామూలుగా గార్డెన్‍లో ఎండిన ఆకులను, గడ్డిని అక్కడే కాల్చేస్తాం. మన దేశంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు.  కానీ అమెరికాలో ఇలా ఆరుబయట చెత్తను కాల్చడంపై అత్యంత కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ముఖ్యంగా కాలిఫోర్నియా, అరిజోనా, కొలరాడో వంటి ఎండలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో త్వరగా మంటలు వ్యాపిస్తాయి. ఎండిన గడ్డి లేదా ఆకులకు అంటుకునే ఒక చిన్న నిప్పురవ్వ…క్షణాల్లో ఇళ్లకు, అడవులకు విస్తరించి భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిప్పు పెట్టడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. 
 
కాల్చాక వచ్చే పొగ పక్కింటి వాళ్లకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీలు వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఈ పొగ ప్రాణాంతకంగా మారుతుంది.

35
మొక్కల ఎంపికపైనా నిబంధనలు

అమెరికాలో చూడటానికి అందంగా ఉండే కొన్ని అలంకరణ మొక్కలను 'ఇన్వేసివ్ స్పీసీస్' (హానికర జాతులు)గా పరిగణించి నిషేధించారు. వెదురు, జపనీస్ నాట్‌వీడ్, ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కలు చాలా వేగంగా విస్తరిస్తూ స్థానిక వృక్షసంపదను, వన్యప్రాణుల సహజ ఆవాసాలను దెబ్బతీస్తాయి.

అంతేకాదు, వీటి మొండి వేర్లు భూమి లోపల పక్కింటి వాళ్ల పునాదులు, పైపులైన్ల వరకు పాకి ఆస్తి నష్టం కలిగిస్తాయి. దీనివల్ల పక్కింటి వారు చట్టపరంగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అందుకే అమెరికాలో మొక్కల ఎంపికపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. 

45
కోళ్లు, మేకలు, బాతులు కూడా పెంచకూడదంట.

మన దేశంలో ఎలాంటి జంతువులనైనా పెంచుకోవచ్చు. దానికి పరిమితులు ఉండవు. కానీ అమెరికాలో గార్డెనింగ్‌తో పాటు పెరట్లో కోళ్లు, జంతువులను పెంచడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. చాలా నగరాల్లో కోడిపుంజులకు అనుమతి ఉన్నా, తెల్లవారుజామున కూతలతో పక్కింటి వారికి ఇబ్బంది కలిగిస్తాయని కోడిపుంజులను పెంచడంపై పూర్తిగా నిషేధం విధించారు.

అలాగే మేకలు, బాతులు లేదా పందులను పెంచాలంటే స్థానిక అధికారుల ప్రత్యేక అనుమతి తప్పనిసరి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దుర్వాసన రాకుండా చూడడం, జంతువుల మేత వల్ల ఎలుకలు, పాములు రాకుండా నివారించడమే ఈ నియమాల ముఖ్య ఉద్దేశం.

55
గార్డెన్లలో కెమికల్ వాడకంపై అమెరికాలో కఠినమైన ఆంక్షలు

గార్డెన్లలో కెమికల్ వాడకంపై అమెరికాలో కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఈ ప్రమాదకర కెమికల్స్ కొట్టుకుపోయి నదులు, సరస్సులు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఇది మొత్తం పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా, ఇవి తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి పరాగసంపర్కానికి తోడ్పడే జీవుల ప్రాణాలకే ముప్పుగా మారుతాయి. అందుకే పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి అమెరికాలోని చాలా రాష్ట్రాలు…నివాస ప్రాంతాల్లో తోటల్లో రసాయనాల వాడకాన్ని చట్టపరంగా పరిమితం చేశాయి.

Read more Photos on
click me!

Recommended Stories