Home Gardening: ఇంట్లోనే కుండీలో అల్లం పెంచాలా...ఈ సింపుల్ టిప్ చాలు
life Apr 10 2026
Author: Nandini Arava Image Credits:gemini AI
Telugu
ఇంట్లోనే తాజా అల్లం పెంచండి!
మార్కెట్ నుంచి తెచ్చే అల్లం కన్నా ఇంట్లో పెంచుకున్న అల్లం చాలా తాజాగా, మంచి సువాసనతో ఉంటుంది. తక్కువ స్థలంలో, చిన్న మట్టి కుండీలో అల్లం ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Image credits: instagram
Telugu
సరైన అల్లాన్ని ఎంచుకోండి
నాటడానికి చిన్న మొలకలు లేదా 'కళ్లు' (Buds) ఉన్న అల్లాన్ని ఎంచుకోవాలి. మరీ పాతగా, ఎండిపోయిన అల్లం వద్దు. మొలకలు ఉన్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
Image credits: instagram
Telugu
మట్టి, కుండీ తయారీ
అల్లం పెంచడానికి లోతు కన్నా వెడల్పుగా ఉండే కుండీ మంచిది. మట్టిలో సమాన పాళ్లలో ఇసుక, సేంద్రియ ఎరువు (కంపోస్ట్) కలపాలి. మట్టి గుల్లగా ఉంటే అల్లం దుంప బాగా పెరుగుతుంది.
Image credits: instagram
Telugu
నాటే సులభమైన పద్ధతి
సిద్ధం చేసుకున్న మట్టిలో 2-3 అంగుళాల లోతైన గుంత తీయాలి. అల్లం మొలకలు లేదా కళ్లు పైకి ఉండేలా చూసుకుని మట్టిలో పెట్టాలి. దానిపై కొద్దిగా మట్టిని చల్లాలి.
Image credits: Getty
Telugu
జాగ్రత్త, నీటి యాజమాన్యం
అల్లం మొక్కకు ఎక్కువ నీళ్లు పోయకూడదు. మట్టిలో తేమ ఉంటే సరిపోతుంది. ఈ మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు, కాస్త నీడ ఉన్న చోటు పెట్టాలి. రోజుకు 2-3 గంటల ఎండ తగిలే చోట కుండీని పెట్టండి.
Image credits: instagram
Telugu
తాజా అల్లం.. పంట కోత
అల్లం పెరగడానికి 8 నుంచి 10 నెలల సమయం పడుతుంది. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోవడం మొదలైనప్పుడు అల్లం తయారైనట్లే. ఇప్పుడు మీరు మట్టిని తవ్వి తాజా అల్లాన్ని బయటకు తీయవచ్చు!