తులసి మొక్క చక్కగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
gardening Apr 10 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
మొక్కను ఎప్పుడు నాటాలి?
తులసి మొక్కను ఎప్పుడూ సాయంత్రం పూట మాత్రమే నాటాలి. నాటిన తర్వాత వారం రోజుల పాటు నేరుగా ఎండ తగలని చోట ఉంచాలి. ఆ తర్వాతే ఎండలో పెట్టాలి.
Image credits: instagram
Telugu
నీళ్లు నిలవకూడదు
తులసి మొక్క కుండీలో నీళ్లు నిలిస్తే వేర్లు కుళ్లిపోతాయి. అందుకే మట్టిలో కొద్దిగా ఇసుక లేదా కోకోపీట్ కలపాలి. దీనివల్ల నీరు సులువుగా బయటకు పోతుంది.
Image credits: instagram
Telugu
కుండీ సైజు ముఖ్యం
తులసి మొక్కను నాటే కుండీ కొంచెం పెద్దదిగా ఉండాలి. వేర్లు పెరిగేందుకు తగినంత స్థలం ఉండాలి. వీలైతే సిమెంట్ లేదా మట్టితో చిన్న తులసి కోట కట్టుకుంటే ఇంకా మంచిది.
Image credits: instagram
Telugu
పసుపు నీళ్లు
మొక్కకు ఫంగస్ వంటివి రాకుండా ఉండాలంటే నీళ్లలో కొద్దిగా పసుపు కలిపి స్ప్రే చేయాలి. ఇది సహజమైన యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది.
Image credits: instagram
Telugu
వాటంతట అవే మొలిస్తే..
తులసి విత్తనాలు రాలి, వాటంతట అవే కొత్త మొక్కలు మొలిస్తే చాలా మంచిదని పండితులు చెబుతారు. అలా పెరిగిన మొక్కలు బలంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu
ఎలాంటి ఎరువు వాడాలి?
తులసి మొక్కకు నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఎరువులు వేయాలి. దీనివల్ల ఆకులు పచ్చగా, మొక్క చక్కగా పెరుగుతుంది.