బఠానీలు
బఠానీల ధర కూడా రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్లో వీటి ధరలు పెరుగుతున్న కొద్దీ నకిలీవి, నాణ్యత లేనివి తయారవుతున్నాయి. అందుకే బఠానీ మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఇంటి అవసరాలకు సరిపడా కాయలు కాస్తుంది. ఈ మొక్క పెంచడానికి కనీసం 10 ఇంచుల లోతున్న కుండీ అవసరం. బఠానీ మొక్కకు 4 నుండి 5 గంటలు ఎండ ఉంటే చాలు.