బాల్కనీలో ఈ మొక్కలు పెడితే.. డెంగ్యూ దోమలు మీ ఇంట్లోకి ఒక్కటి కూడా రాదు

First Published | Oct 26, 2024, 11:14 AM IST

మొక్కలు మన ఇంటిని అందంగా మార్చడమే కాదు.. మనల్ని ఎన్నో ప్రాణాంతక రోగాల నుంచి కూడా కాపాడుతాయి. నిపుణుల ప్రకారం.. బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచితే మీ ఇంట్లోకి ఒక్క డెంగ్యూ దోమ కూడా రాదు. 

వానాకాలం, చలికాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సీజనల్లో డెంగ్యూ, మలేరియా వంటి జబ్బులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ముందే రోజురోజుకూ డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఈ దోమలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఆడవాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా దోమలు మాత్రం అలాగే వస్తూనే ఉంటాయి. 
 

ఇంట్లోకి దోమలు రాకుండా చేయడానికి మార్కెట్ లో కాయిల్స్, దోమ వికర్షక క్రీములు, యంత్రాలు వంటి ఎన్నో ఉత్పత్తులు ఉంటాయి. అయినా అవి ఆరోగ్యానికి మంచివి కావని నమ్మేవారు వీటిని అస్సలు వాడరు. నిజానికి కొన్ని సహజ పద్దతుల్లో కూడా ఇంట్లోకి దోమలు రాకుండా చేయొచ్చు. 

అంటే ఇంటిని సరిగ్గా క్లీన్ చేయడం, సాయంత్రం వేళ కిటికీలను, తలుపును మూసి ఉంచడం, ఇంటి బాల్కనీలో కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వంటివి చేయాలి. అవును కొన్ని రకాల మొక్కలు కూడా ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేస్తాయి.

ఎలా అంటే ఈ మొక్కల వాటన దోమలకు అస్సలు నచ్చదు. దీంతో దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి  దోమలు రాకుండా ఉండటానికి బాల్కనీలో పెట్టాల్సిన మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


lemon grass

లెమన్ గ్రాస్ మొక్క

లెమన్ గ్రాస్ మొక్క కూడా ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీనిని ఎన్నో దోమల నివారిణి ఉత్పత్తుల్లో బాగా ఉపయోగిస్తారు. నిజానికి లెమన్ గ్రాన్ సహాయంతో మీ మూడ్ రిఫ్రెష్ అవుతుంది.

కానీ దోమలకు ఇది దుర్వాసనలా అనిపిస్తుంది. దోమలకు దీని వాసన అస్సలు నచ్చదు. కాబట్టి ఈ వాసన వచ్చే చోటు నుంచి దూరంగా పారిపోతాయి. అందుకే మీ ఇంటి బాల్కనీలో ఈ మొక్కను పెడితే మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. 

బంతిపూల మొక్క

బంతిపూలు ఎంతో అందంగా ఉంటాయి. ఇది డెకరేషన్ కు మాత్రమే కాదు.. మీ బాల్కనీలో పెట్టుకుంటే మీ ఇంట్లోకి దోమలు వచ్చే సాహసం చేయవు. నిజానికి బంతిపూల మొక్క వాసనకు దోమలకు అలెర్జీ ఉంటుంది.

కాబట్టి ఈ మొక్క ఉంటే దోమలతో పాటుగా చిన్న చిన్న కీటకాలు కూడా మీ ఇంటి చుట్టుపక్కలకు రావు. ఇవి రాకుండా ఉండేందుకు ఒక్క బంతిపూల మొక్క ఉన్నా సరిపోతుంది. అంటే పూలు పూయాల్సిన అవసరం కూడా లేదు. 
 

లావెండర్ మొక్క

లావెండర్ మొక్క వాసన అద్బుతంగా ఉంటుంది. దీని వాసన మన మెదడును రీఫ్రెష్ చేస్తుంది. కానీ దోమలను మాత్రం ఆ చుట్టుపక్కలకు రాకుండా ఆపేస్తుంది. అందుకే దీనిని కూడా ఎన్నో దోమల నివారిణి ఉత్పత్తుల్లో బాగా ఉపయోగిస్తారు. ఇందుకోసం మీరు మీ బాల్కనీలో లావెంటర్ మొక్కను పెట్టండి. 

పుదీనా మొక్క

పుదీనా దోమలను ఇంటికి దూరంగా ఉంచడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీని నుంచి వచ్చే వాసన మనల్ని రీఫ్రెష్ గా ఉంచడంతో పాటుగా దోమల బెడదను తగ్గిస్తుంది.

మీరు గనుక దీన్ని మీ బాల్కనీలో నాటితే దీని ఆకులను ప్రతిరోజూ కూరలో వేయడంతో పాటుగా దోమలకు కూడా దూరంగా ఉంటారు. ఇంత చిన్న మొక్క వల్ల మీ ఇంటికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 
 

Latest Videos

click me!