Gardening Mistakes: మొక్కలు బాగా పెరగాలంటే ఎరువులు వేయాలి. నీళ్లను పోస్తూ ఉండాలి. ఇవి చేసినా కూడా కొన్ని మొక్కలు ఎండిపోతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం పదండి.
ఈ రోజుల్లో చాలా మంది ఇంటి పెరట్లో, ఇంటి ముందు, బాల్కనీ, ఇంట్లో రకరకాల ఇండోర్, అవుట్ డోర్ మొక్కలను పెంచుతున్నారు. మొక్కలను పెంచడం పెద్ద టాస్క్ ఏం కాదు. వీటికి ఎరువులు వేస్తూ, సమయానికి నీళ్లను పోస్తే ఎంచక్కా పెరుగుతాయి. అయితే కొంతమంది ఎంత కేర్ తీసుకున్నా మొక్కలు చనిపోతున్నాయని వాపోతుంటారు. నిజానికి ఇలా జరగడానికి మొక్కల సంరక్షణలో చిన్న చిన్న పొరపాట్లే కారణం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
25
మొక్కలు బాగా పెరగాలంటే ఏం చేయాలి?
నీళ్లను ఎక్కువగా పోయడం
కొత్తగా మొక్కలను పెంచేవారు ఎక్కువగా చేసే తప్పు ఇది. నీళ్లను ఎంత ఎక్కువ పోస్తే మొక్కలు అంత పచ్చగా ఉంటాయని, బాగా పెరుగుతాయని అనుకుంటారు. కానీ ఇదే పెద్ద తప్పు. ఎందుకంటే మొక్కలకు నీళ్లను మరీ ఎక్కువగా పోయకూడదు. ఎందుకంటే మొక్కల వేర్లకు ఆక్సిజన్ అందడం చాలా అవసరం. మీరు గనుక నీళ్లను ఎక్కువగా పోసేస్తే కుండలో నీరు పేరుకుపోయి గాలి ప్రసరణ ఉండదు.
దీంతో వేర్లకు ఆక్సిజన్ అందక మొక్క కుళ్లిపోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే మొక్కలకు నీళ్లను ఎక్కువగా పోయకూడదు. అలాగే మొక్కకు నీళ్లను పోయడానికి ముందు మట్టిని చెక్ చేయండి. అంటే మట్టి రెండుమూడు ఆంగుళాలు పొడిగా ఉంటేనే నీళ్లను పోయండి. అలాగే కుండ కింది భాగంలో ఖచ్చితంగా రంధ్రం ఉండేలా చూడండి. అప్పుడే ఎక్కువైన నీరు బయటకు పోతుంది. మొక్క పెరుగుతుంది. పచ్చగా ఉంటుంది.
35
తప్పుడు ప్లేస్ లో పెట్టడం
కొన్ని మొక్కలు ఎండలో పెరిగితే మరికొన్ని మొక్కలు నీడలోనే పెరుగుతాయి. అంటే వీటికి ప్రత్యక్ష ఎండ అవసరం లేదు. అయితే మనలో చాలా మంది ఎండలో పెరగాల్సిన మొక్కను నీడలో, నీడలో పెరగాల్సిన మొక్కను ఎండలో పెడుతుంటారు. అంటే మనిప్లాంట్, స్నేక్ ప్లాంట్ వంటి ఇండోర్ మొక్కలను ఉదయం ఎండలో పెడుతుంటారు. కానీ వీటివల్ల వాటి ఆకులు ఎండిపోయి మొక్క చనిపోతుంది. వీటిని ఎండలో అస్సలు పెట్టకూడదు. అందుకే ఏ మొక్క ఎక్కడ పెరుగుతుందో తెలుసుకోండి. మొక్క గనుక ఎండిపోతే దాని ప్లేస్ మార్చండి.
ప్లాంట్ పాట్ మొక్కకు సరిపోకుంటే కూడా మొక్కలు చనిపోతాయి. మొక్క పెద్దగా అయ్యేది అయితే చిన్న కుండలో పెడితే అది ఎదగదు. దీనివల్ల మొక్కకు మట్టి నుంచి సరైన పోషకాలు అందవు. దీంతో మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి మొక్క కంటే పాట్ పెద్దగా ఉండాలి. ఒకవేళ మొక్క ఎదగకుంటే వెంటనే దాని కుండను మార్చండి.
55
ఎరువును వేయకపోవడం
మొక్కలు బాగా పెరగాలంటే వాటికి ఖచ్చితంగా ఎరువును వేయాలి. అప్పుడే మొక్కలకు అవసరమైన పోషణ అందుతుంది. అయితే కెమికల్స్ ఉన్న ఎరువులను వేస్తే మట్టి నాణ్యతను దెబ్బతీస్తుంది. దీంతో మొక్కలు ఎదగవు. చనిపోతాయి కూడా. అందుకే ఎప్పుడైనా సరే మొక్కలకు కంపోస్ట్, ఆవుపేడ ఎరువు వంటి సహజ ఎరువులనే వేయండి.