Kitchen Garden: ఇంట్లోనే ఈజీగా కూరగాయలు పండించాలా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Published : Aug 15, 2025, 02:23 PM IST

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా రసాయనాలు లేని కూరగాయలను కోరుకుంటున్నారు. మీరు కూడా ఇంట్లోనే తాజా, ఆర్గానిక్ కూరగాయలు పండించుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ టిప్స్. ఓసారి ట్రై చేయండి.

PREV
18
కిచెన్ గార్డెన్ కోసం పాటించాల్సిన చిట్కాలు

కిచెన్ గార్డెన్ ద్వారా.. తాజా, ఆర్గానిక్ ఉత్పత్తులను పొందడానికి అవకాశం ఉంటుంది. బయట మార్కెట్ నుంచి రోజువారీ వినియోగానికి కూరగాయలు కొనే బదులు.. మన ఇంట్లోనే మన చేత్తో కూరగాయలు పండించుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. కిచెన్ గార్డెన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. మరి కిచెన్ గార్డెన్‌ను ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందామా.. 

28
అనువైన ప్రదేశం

గార్డెన్ కోసం ఎండ పడే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలకు కనీసం 5 నుంచి 6 గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. కాబట్టి బాల్కనీ, టెర్రస్‌ లేదా ఇంటి వెనుక ప్రాంగణాలను ఎంచుకోవడం మంచిది.

38
కుండీలు, గ్రో బ్యాగులు

గార్డెన్ కోసం ఖాళీ స్థలం లేనప్పుడు కుండీలు, గ్రో బ్యాగులు మంచి ఎంపిక. అయితే వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. స్థలం ఉంటే మట్టితో మడులు చేసుకొని అందులో కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు. 

48
ఏ కూరగాయలు పెంచవచ్చు?

టమాటా, వంకాయ, బెండకాయ వంటి కూరగాయలు.. పాలకూర, తోటకూర, పుదీన వంటి ఆకుకూరలను పెంచడం మంచిది. మీ కుటుంబ సభ్యులు ఇష్టంగా తినే కూరగాయలు పండించుకోవడం ఉత్తమం. మీ ప్రాంతంలో ఏ మొక్కలు బాగా పెరుగుతాయో తెలుసుకోండి.

58
నేల నాణ్యత

మొక్కలు బాగా పెరగడానికి నేల నాణ్యత చాలా అవసరం. మొక్కలకు అవసరమైన పోషకాలు మట్టి నుంచే అందుతాయి. కాబట్టి నాణ్యమైన నేలను ఎంచుకోవాలి. కంపోస్ట్, కోకోపిట్ వంటివి నేలను సారవంతం చేసి మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

68
విత్తనాలు/మొక్కలు నాటడం

కిచెన్ గార్డెన్ కోసం కూరగాయల విత్తనాలను నేరుగా నాటుకోవచ్చు. లేదా నర్సరీ నుంచి చిన్న మొక్కలను కొనుగోలు చేయవచ్చు. అయితే విత్తనాలు నాటేటప్పుడు విత్తనాల ప్యాకెట్ లో సూచించిన లోతు, దూరం కచ్చితంగా పాటించాలి.

78
నీరు పోయడం

మొక్కలకు నీరు చాలా అవసరం. కానీ ఎక్కువ నీరు పోసినా.. తక్కువ నీరు పోసినా అవి చనిపోతాయి. కాబట్టి మట్టి పై పొర ఎండిపోయినప్పుడు మొక్కలకు నీరు పోయాలి. ఉదయం లేదా సాయంత్రం నీరు పోయడం మంచిది.

88
సహజ ఎరువులు

మొక్కలు చక్కగా పెరగాలంటే.. పోషకాలు అవసరం. హానికరమైన రసాయనాలకు బదులు సేంద్రియ ఎరువులు వాడటం మంచిది. మొక్కలకు.. వంటింటి వ్యర్థాలు, పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ వంటివాటిని క్రమం తప్పకుండా వేయాలి. తెగుళ్ల సమస్యను తొలగించేందుకు వెల్లుల్లి నీరు, వేప నూనె వంటివి స్ప్రే చేయవచ్చు.  

Read more Photos on
click me!

Recommended Stories