మెంతి కూర..
మీ ఇంట్లో మెంతులు ఉంటే.. మెంతికూర కూడా ఈజీగా పెంచొచ్చు. ఏ సీజన్ లో అయినా ఈజీ పెరుగుతుంది. ఒక రాత్రంతా మెంతులను నీటిలో నానపెట్టి.. తర్వాత.. మట్టిలో చల్లితే.. పది రోజుల్లో మొలకెత్తి ఆకులు రావడం మొదలౌతాయి. మైక్రో గ్రీన్స్ గా ఉన్నప్పుడే కట్ చేసి..వంటల్లో వేసుకోవచ్చు. కొద్దిగా ఎండ తగిలితే చాలు.. ఈజీగా పెరుగుతుంది.
పాలకూర..
పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని కూడా మనం ఇంట్లో పెంచొచ్చు. పాలకూర పెరగడానికి ఎక్కువ రోజులు పట్టొచ్చు. కానీ.. మైక్రో గ్రీన్స్ గా ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న ఆకులుగా ఉన్నప్పుడే కట్ చేసుకొని వంటల్లో వేసుకోవచ్చు. ఇవి కూడా 15 రోజుల్లో పెరిగేస్తాయి.
పచ్చి వెల్లుల్లి ఆకులు
వెల్లుల్లి రెబ్బలను మట్టిలో నాటితే, సుమారు 15 నుండి 20 రోజులలో పచ్చని ఆకులు వస్తాయి. ఈ ఆకులను సూప్‌లు, సలాడ్‌లు కూరగాయలలో ఉపయోగించుకోవచ్చు. చిన్న కుండీకి బదులుగా, ప్లాస్టిక్ బాటిల్ ప్లాంటర్‌లో కూడా వెల్లుల్లిని నాటవచ్చు.