Kitchen Hacks: ప్రతి ఇంట్లో రోజూ ఉదయం, సాయంత్రం టీ తాగడం సాధారణం. టీ చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని చాలామంది కచ్ఛితంగా చెత్తబుట్టలో వేస్తారు. అయితే దీని లాభాలు తెలిస్తే మాత్రం ఇకపై ఆ పని చేయరు.
ఉపయోగించిన టీ పొడి మొక్కలకు చాలా ఉపయోగకరం. ఇది మట్టికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తుంది. పూల మొక్కలకు ఇది ప్రత్యేకంగా మేలు చేస్తుంది. టీ పొడిలో పాలు, చక్కెర మిగలకుండా నీటితో కడిగి బాగా ఎండబెట్టాలి. ఆ తరువాత నేరుగా మట్టిలో కలపాలి లేదా ఎరువుతో కలిపి మొక్కల దగ్గర వేయాలి.
25
పాత్రలు సులభంగా శుభ్రం చేసుకోవచ్చు
నాన్‌స్టిక్ పాత్రలపై మచ్చలు, వాసన తొలగించడానికి ఉపయోగించిన టీ పొడి సహాయపడుతుంది. టీ పొడిని నీటిలో మరిగించి కొద్దిగా వెనిగర్ కలపాలి. ఆ నీటిని పాత్రలో వేసి కొంతసేపు ఉంచాలి. తరువాత సాధారణ డిష్‌వాష్ లిక్విడ్‌తో కడిగితే పాత్రలు మెరిసిపోతాయి.
35
ఫ్రిజ్‌లో చెడు వాసన తొలగింపు
ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనకు టీ పొడి చక్కటి పరిష్కారం. ఉపయోగించిన టీ పొడిని శుభ్రంగా కడిగి కాటన్ గుడ్డలో కట్టి ఫ్రిజ్ మూలలో ఉంచాలి. ఇది ఫ్రిజ్‌లోని చెడు వాసనను పూర్తిగా తొలగిస్తుంది.
ఉపయోగించిన టీ పొడి చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీంతో స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. టీ పొడిని తేనె, పెరుగు లేదా నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడవచ్చు. అలాగే టీ పొడిని గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఆ నీటిలో పాదాలు ముంచితే పాదాల పగుళ్లు తగ్గుతాయి, నొప్పి తగ్గుతుంది.
55
జుట్టుకు సహజ కండిషనర్
టీ పౌడర్ జుట్టుకు సహజ కండిషనర్‌లా పని చేస్తాయి. జుట్టుకు మెరుపు ఇస్తాయి. టీ చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని శుభ్రంగా కడిగి వడకట్టి నీటిలో మరిగించాలి. ఆ నీటితో తరచుగా తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.