సాధారణంగా ప్రతి సమ్మర్ లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎండల తీవ్రతను తట్టుకోవడానికి అందరూ ఏసీల పైనే ఆధారపడతారు. దీనివల్ల కరెంటు బిల్లు పెరగడంతో పాటు ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఆర్టిఫిషియల్ గా చల్లదనాన్ని క్రియేట్ చేసుకునే బదులు, ప్రకృతి ఇచ్చిన మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇల్లంతా చల్లగా ఉంటుంది. ఏ గదిలో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే ఇల్లు చల్లగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి అక్షయ తృతీయ కరెక్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?
బెడ్ రూమ్ లో స్నేక్ ప్లాంట్ ను పెంచుకోండి. ఇది రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దీంతో రాత్రి వేళల్లో గది చల్లగా మారుతుంది.
లివింగ్ రూమ్ లో అరేకా ప్లాంట్ పెంచుకోండి. ఇది గాలిలో ఉండే తేమను అలాగే నిలిపి ఉంచుతుంది. అందువల్ల గది ఎప్పుడు నార్మల్ టెంపరేచర్ లో ఉంటుంది.
బాల్కనీలో గాని, వీధివైపు ఉండే గదిలో ఫికస్ మొక్కలు పెంచండి. ఇవి గాలిలో ఉండే కాలుష్యాన్ని తగ్గిస్తాయి. గాలి నాణ్యతను పెంచుతాయి. ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేస్తాయి.
గోల్డెన్ ఫొథోస్ అనే ఈ విదేశీ మొక్కను ఇంట్లో జాగ్రత్తగా పెంచితే దాని చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈ మొక్క పెరగడానికి కాస్త వెలుతురు కావాలి. అందువల్ల మీ ఇంట్లో కాస్త వెలుతురు ఉండే ప్రాంతంలో ఈ మొక్కను పెంచండి.
ఈ కాలంలో కలబంద మొక్కను పెంచని వాళ్ళు ఎవరూ ఉండరు. చాలామంది ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుతారు. కానీ దీన్ని ఇంట్లో గదుల్లో పెంచితే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది. వాతావరణంలో వేడిని కూడా తగ్గిస్తుంది.
ఈ మొక్కలన్నీ ప్రతి నర్సరీలో అందుబాటులో ఉంటాయి. మీ సమీపంలో ఉన్న నర్సరీకి వెళ్లి ఇప్పుడే ఈ మొక్కలు తెచ్చుకుని మీ ఇంటిని చల్లని ప్రదేశంగా మార్చుకోండి.