Heat Resistant Plants నీటి కొరత టెన్షన్ వద్దు.. వేసవిలోనూ పెరిగే మొక్కలివే!

వేసవి కాలంలో నీటి కొరత విపరీతంగా ఉంటుంది. అదేసమయంలో మొక్కలు త్వరగా ఎండిపోతాయి. అవి బతకాలన్నా నీరే కావాలి. ఈ రెండింటికీ పరిష్కారంగా సమ్మర్ లో నీటి అవసరం పెద్దగా లేకుండానే  పెరిగే కొన్నిరకాల మొక్కల గురించి తెలియజేస్తున్నాం. వెంటనే వీటిని మీ పెరట్లో, ఇంటి ఆవరణలో నాటేయండి మరి. 

వేడిని, నీటి ఎద్దడిని తట్టుకుని పెరిగే కొన్ని అందమైన మొక్కలు, చెట్లు ఇవి. 

బౌగెన్‌విల్లా

ఇది ఎండలో బాగా పెరిగే తీగ. దీనికి తక్కువ నీరు అవసరం. ఇది చాలా తొందరగా పెరుగుతుంది. లాంటానా ఎండలో, వేడిలో బాగా పెరుగుతుంది. దీని పువ్వులు సీతాకోకచిలుకలను ఆకర్షిస్తాయి. దీనికి తక్కువ నీరు అవసరం.

అగేవ్‌

అగేవ్‌ తన ఆకుల్లో నీటిని నిల్వ చేసుకుంటుంది, బయటి నుంచి నీరు అందనప్పుడు ఆ నీటిని వాడుకుంటుంది. అందుకే ఇది ఎంత ఎండాకాలంలో అయినా ఎండిపోదు. పైగా ఎండలో బాగా పెరుగుతుంది, దీనికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు.

ఒలిండర్

ఒలిండర్ వేడిని, కరువును తట్టుకునే గట్టి మొక్క. ఇది వివిధ రంగుల్లో పూస్తుంది. అయితే వీటిలో కొన్ని భాగాలు విషపూరితమైనవి. చూడటానికి అందంగా ఉన్నా.. వీటిని పెంచకుండా ఉంటేనే మంచిది.


యుక్కా

యుక్కా మొక్కలు వేడిని, కరువును తట్టుకుంటాయి. వీటికి తెల్లటి పువ్వులు వస్తాయి. ఇవి ఎండలో బాగా పెరుగుతాయి.

పోర్టులాకా (Moss Rose)

పోర్టులాకా ఎండలో పెరిగే మొక్క. దీనికి తక్కువ నీరు అవసరం, ఇది వేసవిలో అందంగా ఉంటుంది.

రెడ్ హాట్ పోకర్ (Kniphofia)

ఈ మొక్క వేడిని తట్టుకుంటుంది. దీని పువ్వులు చూడటానికి చాలా బాగుంటాయి. పక్షులు దీనికి ఆకర్షితులవుతాయి.

Latest Videos

click me!