మొక్కలు పెంచడాన్ని చాలామంది ఇష్టపడతారు. మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు.. స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయి. ముఖ్యంగా 5 రకాల మొక్కలు ఇంట్లో ఉంటే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
ప్రస్తుత రోజుల్లో బయటి గాలితో పోలిస్తే ఇంట్లో గాలే ఎక్కువ రెట్లు కలుషితమై ఉంటోందనే విషయం మీకు తెలుసా? అవును.. ఫర్నిచర్ పెయింట్స్, క్లీనింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే విష పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా స్వచ్చమైన గాలితో పాటు ఇంటి అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. మరి ఆ మొక్కలేంటో వాటి వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం.
27
స్నేక్ ప్లాంట్
ఇంట్లో మొక్కలు పెంచాలి అనుకునేవారికి స్నేక్ ప్లాంట్ బెస్ట్ ఛాయిస్. ఇది చాలాకాలం బతుకుతుంది, తక్కువ వెలుతురులోనూ బాగా పెరుగుతుంది. మిగతా మొక్కల్లా కాకుండా, ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జైలీన్ వంటి విష రసాయనాలను పీల్చుకుంటుంది. దీనికి చాలా తక్కువ నీళ్లు అవసరం. మట్టి పూర్తిగా ఆరిపోయాక మాత్రమే నీళ్లు పోయాలి.
37
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ని చాలా ఇళ్లల్లో పెంచుతుంటారు. వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ మొక్కను శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క ఇంటి మూలమూలలకూ పాకి, పచ్చదనంతో నింపేస్తుంది. గాలిలోని విష పదార్థాలను తొలగించడంలో ఇది ముందు వరుసలో ఉంటుంది. దీన్ని మట్టిలో, నీటిలో కూడా పెంచవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచడానికి కూడా సహాయపడుతుంది.
పీస్ లిల్లీ తన తెల్లని పువ్వులు, మెరిసే ఆకులతో ఏ లివింగ్ రూమ్‌కైనా 'ప్రీమియం' లుక్ ఇస్తుంది. ఇది చూడటానికి అందంగా ఉండటమే కాకుండా, గాలిలోని తేమను నియంత్రించడంలో సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం, ఇది గాలిలోని అమ్మోనియా, బూజు బీజాలను శుభ్రం చేస్తుంది. ఈ మొక్క తక్కువ వెలుతురులో కూడా ఈజీగా పెరుగుతుంది. ఎప్పుడూ మట్టి తేమగా, నీరు నిలిచిపోకుండా ఉంటే చాలు.. చక్కగా పెరుగుతుంది.
57
కలబంద
కలబంద 'టూ-ఇన్-వన్' మొక్క. ఇది గాలిని శుభ్రపరచడమే కాకుండా, దీని జెల్‌ను చర్మం, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు. ఇది గాలి నుంచి బెంజీన్, ఫార్మాల్డిహైడ్‌ను తొలగిస్తుంది. ఇంట్లో తాజా వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. మంచిగా సూర్యరశ్మి పడే కిటికీ దగ్గర దీన్ని పెట్టుకోవచ్చు. మట్టి పూర్తిగా ఆరిపోయిన తర్వాత నీళ్లు పోస్తే సరిపోతుంది.
67
స్పైడర్ ప్లాంట్
స్పైడర్ ప్లాంట్ కూడా ఇంట్లో పెంచడానికి చాలా అనువైన మొక్క. ఎందుకంటే ఇందులో విషపూరిత గుణాలు ఉండవు. దీని పొడవైన, వేలాడే ఆకులు హ్యాంగింగ్ బాస్కెట్లలో చాలా అందంగా కనిపిస్తాయి. ఇది కార్బన్ మోనాక్సైడ్, చెడు వాసనలను తొలగించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది ఇంటి వాతావరణాన్ని తాజాగా, కాలుష్య రహితంగా ఉంచుతుంది. పరోక్ష వెలుతురులో ఇది బాగా పెరుగుతుంది. వారానికి 2-3 సార్లు నీళ్లు పోస్తే చాలు.
77
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఇండోర్ మొక్కలు చనిపోవడానికి ప్రధాన కారణం ఎక్కువ నీళ్లు పోయడమే. కాబట్టి సరిపడా నీళ్లు పోయడంతో పాటు కుండీకి తప్పనిసరిగా డ్రైనేజ్ హోల్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆకులపై పేరుకునే దుమ్ము, కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి తడి గుడ్డతో అప్పుడప్పుడు ఆకులను తుడవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంట్లో స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది.