Smart TV: రూ. 8 వేల‌కే 32 ఇంచుల QLED స్మార్ట్ టీవీ.. ఇలాంటి ఆఫ‌ర్ మ‌ళ్లీ రాదు బాసూ

Published : Nov 08, 2026, 04:39 PM IST

Smart TV: తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి Visio World 32 ఇంచుల QLED టీవీ ఒక ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఇందులో QLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫీచర్లు, ప్రముఖ OTT యాప్స్, మంచి సౌండ్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

PREV
15
32 ఇంచుల QLED డిస్‌ప్లే

Visio World VW32AQ3 స్మార్ట్ టీవీలో 32 ఇంచుల (80 సెం.మీ.) QLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో HD క్వాలిటీని అందిస్తుంది. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. QLED టెక్నాలజీ కారణంగా 1.67 కోట్ల రంగులను సపోర్ట్ చేస్తుంది. అలాగే 350 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, HDR10 సపోర్ట్, 1,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో పక్క నుంచి చూసినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అస‌లు ధ‌ర రూ. 13000 కాగా అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 8399కే ల‌భిస్తోంది.

25
OTT యాప్స్, స్మార్ట్ ఫీచర్లు

ఈ టీవీలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫీచర్లు అందించారు. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ OTT యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ ద్వారా మొబైల్‌లోని వీడియోలు, ఫొటోలను టీవీ స్క్రీన్‌పై చూడవచ్చు. అలాగే PC కనెక్టివిటీ, Playwall, IPE టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

35
24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్

చిన్న సైజు టీవీ అయినప్పటికీ ఇందులో 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ ఇచ్చారు. బాక్స్ స్పీకర్లతో కూడిన స్టీరియో సరౌండ్ సౌండ్ సదుపాయం ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఐదు రకాల సౌండ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. సినిమాలు, టీవీ కార్యక్రమాలు, సంగీతం వినేటప్పుడు ఆడియో అనుభూతిని మెరుగుపరచడానికి ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.

45
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు

ఈ టీవీలో వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు అవసరమైన పోర్టులు ఉన్నాయి. ఇందులో రెండు HDMI 2.0 పోర్టులు, ఒక HDMI 2.1 పోర్టు అందించారు. వీటి ద్వారా సెట్‌టాప్ బాక్స్, బ్లూ-రే ప్లేయర్, గేమింగ్ కన్సోల్ వంటి పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రెండు USB 2.0 పోర్టులు ఉన్నాయి. వైఫై, ఈథర్‌నెట్ సదుపాయాలతో ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీని కొలతలు 78 x 44 x 9 సెంటీమీటర్లు. టీవీతో పాటు రిమోట్, పవర్ కేబుల్, యూజర్ మాన్యువల్, రెండు స్టాండ్లు, నాలుగు స్క్రూలు అందిస్తారు.

55
ఎవరికి ఉపయోగకరం?

Visio World VW32AQ3 టీవీ చిన్న గదులు, బెడ్‌రూమ్‌లు, పిల్లల గదుల్లో ఉపయోగించడానికి అనువైన మోడల్‌గా చెప్పవచ్చు. OTT యాప్స్ ద్వారా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ కాకుండా HD (1366 x 768) రిజల్యూషన్ మాత్రమే ఉంది. కాబట్టి పూర్తి HD క్వాలిటీ కోరుకునేవారు ఈ విషయాన్ని గమనించాలి. 32 ఇంచుల QLED డిస్‌ప్లే, స్మార్ట్ ఫీచర్లు, 24 వాట్స్ సౌండ్ వంటి సదుపాయాలతో చిన్న సైజు స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నవారు ఈ మోడల్‌ను పరిశీలించవచ్చు.

గ‌మ‌నిక‌: ఈ వివ‌రాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ప్రొడ‌క్ట్ కొనుగోలు చేసే ముందు. రివ్యూల‌ను, క‌స్ట‌మ‌ర్స్ రేటింగ్స్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories