అక్టోబర్ 2025లో X300 సిరీస్‌తో పాటు చైనాలో ఈ వాచ్ రిలీజ్ అయింది. ఇందులో 2.07 అంగుళాల రెక్టాంగులర్ డిస్‌ప్లే, 432x514 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. BlueOS 3.0 తో పనిచేసే ఈ వాచ్ బ్లూటూత్, eSIM వెర్షన్లలో దొరుకుతుంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, NFC, బ్లూటూత్ 5.4 సపోర్ట్, 2ATM వాటర్ రెసిస్టెన్స్ దీని సొంతం. బ్లూటూత్ వెర్షన్ (695mAh) 33 రోజులు, eSIM వెర్షన్ (595mAh) 28 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని వివో చెబుతోంది. ఇవన్నీ చైనా మోడల్ ఫీచర్లు.