Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?

Published : Jan 07, 2026, 10:37 AM IST

Realme 16 Pro Series : భారత మార్కెట్లో రియల్‌మీ 16 ప్రో, 16 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. 200MP కెమెరా, 7000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ల ధర, ఆఫర్ల వివరాలు మీకోసం.

PREV
16
Realme 16 Pro Series : ఐఫోన్‌ను తలపించే ఫీచర్లు.. రియల్‌మీ 16 ప్రో, 16 ప్రో ప్లస్ లో సూపర్ ఫీచర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన సరికొత్త రియల్‌మీ 16 ప్రో సిరీస్ ను అధికారికంగా ఇండియాలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 16 ప్రో (Realme 16 Pro), రియల్‌మీ 16 ప్రో ప్లస్ (Realme 16 Pro+) అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

వీటితో పాటు కొత్త రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8, రియల్‌మీ ప్యాడ్ 3 టాబ్లెట్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ప్రధానంగా కెమెరా పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, 5జీ పెర్ఫార్మెన్స్‌పై దృష్టి సారించి ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చారు. ఈ రెండు ఫోన్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో ఈ నెల నుంచే అందుబాటులోకి రానున్నాయి.

26
Realme 16 Pro Series : అద్భుతమైన డిజైన్, డిస్‌ప్లే, ఇతర ఫీచర్లు

ఈ సిరీస్ డిజైన్ కోసం రియల్‌మీ ప్రముఖ డిజైనర్ నవోటో ఫుకసావాతో చేతులు కలిపింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లకు వెనుక వైపు బయో బేస్డ్ ఆర్గానిక్ సిలికాన్ బ్యాక్ కవర్‌ను అందించారు. ఇది మంచి గ్రిప్‌ను ఇవ్వడమే కాకుండా చూడటానికి ప్రీమియంగా కనిపిస్తుంది. గోధుమ గింజల నమూనాతో కూడిన ఈ ఆకృతి చేతికి మృదువైన అనుభూతిని ఇస్తుంది. రియల్‌మీ 16 ప్రో ప్లస్ మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, కెమెలియా పింక్ రంగుల్లో లభిస్తుంది. రియల్‌మీ 16 ప్రో మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, ఆర్కిడ్ పర్పుల్ రంగుల్లో వస్తుంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే, రియల్‌మీ 16 ప్రో ప్లస్ 6.8-అంగుళాల 1.5K హైపర్‌గ్లో 4D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది, ఇది చీకటి ప్రదేశాల్లో కూడా కళ్లకు రక్షణ కల్పిస్తుంది. రియల్‌మీ 16 ప్రో 6.78-అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది, ఇది కూడా 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్లు IP69 రేటెడ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉండటం విశేషం.

36
Realme 16 Pro Series : శక్తివంతమైన ప్రాసెసర్, అప్డేట్ సాఫ్ట్‌వేర్

పనితీరు పరంగా రియల్‌మీ 16 ప్రో ప్లస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ AnTuTu స్కోరులో 1.44 మిలియన్ పాయింట్లను సాధించిందని, 120FPS వద్ద కూడా లాగ్ ఫ్రీ గేమింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. మరోవైపు, రియల్‌మీ 16 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ చిప్‌సెట్‌తో వస్తోంది.

రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0తో వస్తాయి. ఇందులో నెక్ట్స్ ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏఐ ఫ్రేమింగ్ మాస్టర్, ఏఐ రికార్డింగ్, ఏఐ ట్రాన్స్‌లేషన్, ఏఐ గేమింగ్ కోచ్, గూగుల్ జెమిని లైవ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్లక్స్ ఇంజిన్ ద్వారా రోజువారీ రెస్పాన్స్ 15% వేగంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

46
Realme 16 Pro Series : అధునాతన కెమెరా ఫీచర్లు

ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా విభాగం. రెండు ఫోన్లలోనూ వెనుక వైపు 200MP లూమాకలర్ కెమెరాను అమర్చారు. అయితే, రియల్‌మీ 16 ప్రో ప్లస్ అదనంగా 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఇది 7x క్లోజప్స్, 10x స్టేజ్ క్యాప్చర్స్, 120x సూపర్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫుల్‌ఫోకల్ పోర్ట్రెయిట్ లెన్స్ కిట్, ప్రోడెప్త్ బోకే ఆల్గారిథమ్‌తో జుట్టు స్థాయి బ్లర్‌ను కూడా స్పష్టంగా తీయగలదని రియల్‌మీ పేర్కొంది. రియల్‌మీ 16 ప్రో కూడా 200MP కెమెరా, గోల్డెన్ పోర్ట్రెయిట్ లెన్స్ కిట్‌ను కలిగి ఉంటుంది.

56
Realme 16 Pro Series : బ్యాటరీ, ఇతర ప్రత్యేకతలు

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రెండు స్మార్ట్‌ఫోన్‌లలోనూ భారీ 7000mAh బ్యాటరీని అందించారు. ఇది సులభంగా ఒక రోజంతా ఛార్జింగ్ వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ వేడెక్కకుండా చూసేందుకు ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్ ఇందులో అమర్చారు.

రియల్‌మీ 16 ప్రో ప్లస్ 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది, అయితే ఇందులో మెమరీని పెంచుకునే ఆప్షన్ లేదు. రియల్‌మీ 16 ప్రో సిరీస్ ద్వారా వినియోగదారులకు ఫ్లాగ్‌షిప్ స్థాయి అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

66
Realme 16 Pro Series : ధర, ఆఫర్లు ఇవే

రియల్‌మీ 16 ప్రో సిరీస్ ధరలను కంపెనీ చాలా పోటీతత్వంతో నిర్ణయించింది. రియల్‌మీ 16 ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ. 35,999 కాగా, రియల్‌మీ 16 ప్రో ప్రారంభ ధర రూ. 28,999 గా ఉంది. ఈ రెండు మోడళ్లు 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB వేరియంట్లలో లభిస్తాయి. వినియోగదారులు రియల్ మీ అధికారికి వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ లో, పలు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ 16 ప్రో ప్లస్ వేరియంట్ల ధరలు

• 8GB + 128GB: రూ. 39,999 (ఆఫర్లతో రూ. 35,999)

• 8GB + 256GB: రూ. 41,999 (ఆఫర్లతో రూ. 37,999)

• 12GB + 256GB: రూ. 44,999 (ఆఫర్లతో రూ. 40,999)

రియల్‌మీ 16 ప్రో వేరియంట్ల ధరలు (ఎంఓపి):

• 8GB + 128GB: రూ. 31,999 (ఆఫర్లతో రూ. 28,999)

• 8GB + 256GB: రూ. 33,999 (ఆఫర్లతో రూ. 30,999)

• 12GB + 256GB: రూ. 36,999 (ఆఫర్లతో రూ. 33,999)

బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్‌ఛేంజ్ బోనస్, రియల్‌మీ బడ్స్ బహుమతులు వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories