Tech News: బ్లూటూత్ ఇయ‌ర్‌ఫోన్స్‌తో క్యాన్స‌ర్ వ‌స్తుందా.? ఇందులో నిజ‌మెంత‌..

Published : Dec 31, 2025, 04:41 PM IST

Tech News: ప్ర‌స్తుతం బ్లూటూత్ వినియోగం భారీగా పెరిగింది. ప్ర‌తీ ఒక్క‌రూ బ్లూటూత్‌ల‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటి వినియోగంతో క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్న వార్త‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇంత‌కీ ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందంటే. 

PREV
15
బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌పై చ‌ర్చ

ప్ర‌స్తుతం వైర్ ఉన్న ఇయర్‌ఫోన్స్ అరుదుగా కనిపిస్తున్నాయి. ఆఫీసుల్లో, రోడ్లపై, ప్రయాణాల్లో చాలామంది బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారు. ఈ టెక్నాలజీ జీవితం సులభం చేసింది. అయితే ఇదే సమయంలో ఒక భయం కూడా పెరిగింది. చెవుల్లో పెట్టుకునే బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది.

25
బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఏ రకం?

బ్లూటూత్ టెక్నాలజీ షార్ట్ రేంజ్ వైర్‌లెస్ కనెక్షన్ కోసం పని చేస్తుంది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ ఉపయోగిస్తారు. ఇది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్‌లో ఒక రూపం. ఈ రేడియేషన్ మన చుట్టూ సహజంగానే ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ఎఫ్‌ఎం రేడియో, టీవీ ప్రసారాలు కూడా ఇదే తరహా రేడియేషన్ విడుదల చేస్తాయి

35
క్యాన్సర్ ప్రమాదం నిజంగా ఎంత వరకు ఉంటుంది?

2015లో కొంతమంది శాస్త్రవేత్తలు నాన్-ఐయోనైజింగ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెక్నాలజీ వల్ల ఆరోగ్య సమస్యలు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లూటూత్ డివైసులు ఇదే టెక్నాలజీపై పనిచేస్తాయి. కానీ ఇప్పటివరకు బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వాడకం నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతుందనే స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు అని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చెబుతోంది.

45
నిపుణులు ఏమంటున్నారు?

యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన బయోఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎమెరిటస్ కెన్ ఫోస్టర్ అభిప్రాయం ప్రకారం, బ్లూటూత్ డివైసులు మొబైల్ ఫోన్ల కంటే చాలా తక్కువ రేడియేషన్ విడుదల చేస్తాయి. రోజుకు చాలాసేపు బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ వాడితే ఎక్స్‌పోజర్ కొంత పెరుగుతుంది. అయినా కూడా మొబైల్ ఫోన్‌ను నేరుగా చెవికి పెట్టుకుని మాట్లాడే అలవాటుతో పోలిస్తే ఇది తక్కువ ప్రమాదమే అని ఆయన చెబుతున్నారు.

55
రేడియేషన్ రకాలు, క్యాన్సర్ మధ్య సంబంధం ఏమిటి?

రేడియేషన్ రెండు రకాలుగా ఉంటుంది. నాన్-ఐయోనైజింగ్ రేడియేషన్, ఐయోనైజింగ్ రేడియేషన్. నాన్-ఐయోనైజింగ్ రేడియేషన్‌లో శక్తి తక్కువగా ఉంటుంది. ఇది సెల్స్ డీఎన్‌ఏను నేరుగా దెబ్బతీయదు. బ్లూటూత్ డివైసులు విడుదల చేసే రేడియేషన్ ఈ కోవకే చెందుతుంది. ఐయోనైజింగ్ రేడియేషన్ మాత్రం ఎక్స్-రేలు, రేడియేషన్ థెరపీ లాంటి వాటిలో ఉంటుంది. ఇవే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశాలు ఎక్కువగా కలిగిస్తాయి. ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ క్యాన్సర్‌కు కారణమవుతుందనే నిర్ధారణ లేదు.

Read more Photos on
click me!

Recommended Stories