వన్‌ప్లస్ 15 లాంచ్: స్పెక్స్, ఫీచర్లు, ధర వివరాలు ఇవే

Published : Oct 26, 2025, 04:01 PM IST

OnePlus 15 Launch : వన్‌ప్లస్ 15 మొదట చైనాలో లాంచ్ అవుతోంది. శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్, 7,300mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా సహా అద్భుతమైన ఫీచర్లతో ఇండియాకు కూడా రానుంది.

PREV
15
వన్‌ప్లస్ 15 లాంచ్ ఎప్పుడు?

వన్‌ప్లస్ 15 సోమవారం (అక్టోబర్ 27) చైనాలో అధికారికంగా విడుదలకానుంది. ఇది గత సంవత్సరం విడుదలైన వన్‌ప్లస్ 13 సక్సెసర్. చైనాలో మొదట లాంచ్ అయ్యే ఈ ఫోన్, వచ్చే నెలలో గ్లోబల్ మార్కెట్లోకూ రానుంది. ఇండియా లాంచ్ కొన్ని వారాల్లో ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 15తో పాటు చైనా మార్కెట్లోకి వన్ ప్లస్ ఏస్ 6 (OnePlus Ace 6) కూడా రానుంది. ఈ ఈవెంట్ బీజింగ్ సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (IST 4:30 PM) ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే లీక్స్, రిపోర్ట్స్ ద్వారా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో ఉండే ఫీచర్లు బయటకు వచ్చాయి.

25
వన్‌ప్లస్ 15 డిజైన్, బిల్డ్ క్వాలిటీ

వన్‌ప్లస్ 15 డిజైన్ వన్‌ప్లస్ 13కు దగ్గరగా ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. వెనుక స్కువోవల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. కంపెనీ బ్రాండింగ్ మధ్యలో ఉంటుంది. ఫోన్‌లో మైక్రో స్పేస్-గ్రేడ్ నానో-సెరామిక్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. దీంతో అత్యంత బలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 

IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. బరువు 211 గ్రాములు, మందం 8.1 mm గా ఉంటుంది. వన్‌ప్లస్ 15 ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో రానుంది. ముదురు గోధుమ రంగు, మిస్ట్ పర్పుల్, నలుపు రంగులలో విడుదల కానుంది.

35
వన్‌ప్లస్ 15 డిస్ప్లే, ప్రాసెసర్ ప్రత్యేకతలు ఏంటి?

వన్‌ప్లస్ 15లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 165Hz. ఇది థర్డ్ జెన్ 1.5K BOE Flexible Oriental OLED ప్యానల్. ఈ ఫోన్‌ క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Qualcomm Snapdragon 8 Elite Gen 5) చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇది 4K వీడియో ఎడిటింగ్, హై లెవల్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో మెరుగైన పనితీరును అందిస్తుంది. 

ఆండ్రాయిడ్ (Android) 16పై ఆధారపడిన ఆక్సిజన్ ఓఎస్ (OxygenOS) 16తో ఇండియా వెర్షన్ రానుంది. చైనా వెర్షన్ కలర్ ఓఎస్ (ColorOS) 16తో వస్తుంది. గేమింగ్ కోసం G2 నెట్‌వర్క్ చిప్ ఉండటంతో వేగవంతమైన టచ్ రెస్పాన్స్ సపోర్ట్ లభిస్తుంది.

45
వన్‌ప్లస్ 15 కెమెరా అప్‌గ్రేడ్స్

వన్‌ప్లస్ 15 లో వెనుక ట్రిపుల్ 50MP కెమెరా సెట్ అప్ ఉంటుంది. ఇందులో 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా (3.5x ఆప్టికల్ జూమ్) ఉంటాయి.

4K వీడియో రికార్డింగ్ 120FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం Max Engine Camera System ఉండటంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. చైనాలో దీన్ని “Lumo” అని పిలుస్తారు. కొత్త Master Modeతో కలర్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు.

55
వన్‌ప్లస్ 15 బ్యాటరీ, ఛార్జింగ్, లాంచ్, ధర వివరాలు

వన్‌ప్లస్ 15లో 7,300mAh Glacier Battery ఉంటుంది. మూడు రోజుల వరకు మోడరేట్ యూజ్‌లో పనిచేస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక ఛార్జింగ్ వివరాలు గమనిస్తే.. 120W సూపర్ ప్లాష్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

గ్లోబల్ లాంచ్ నవంబర్ 12న జరగవచ్చని టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ తెలిపాడు. ఇండియా లాంచ్ నవంబర్ 13న ఉండే అవకాశముంది. ఇండియాలో వన్ ప్లస్ 15 ధర రూ.70,000–75,000 మధ్యలో ఉండవచ్చని అంచనా. 16GB + 512GB స్టోరేజ్ వెరియంట్, తన ముందు మోడల్ కంటే కొంచెం తక్కువ ధరలో రావచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇండియా లో వన్ ప్లస్ ఆన్ లైన్ స్టోర్ (OnePlus.in) అమెజాన్ (Amazon) లలో సేల్ కు తీసుకురానున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories