iPhone 16 Plus Big Discount Offer: సూపర్ ఫీచర్లతో వచ్చిన ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 16 ప్లస్ పై ₹25,910 భారీ తగ్గింపు ఉంది. ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ తో బెస్ట్ డీల్స్ ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్లస్ పై ₹25,910 వరకు బంపర్ తగ్గింపు ఆఫర్
దీపావళి సేల్ ముగిసినా, రిలయన్స్ డిజిటల్‌లో ఇంకా ఒక గోల్డెన్ ఆఫర్ కొనసాగుతోంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. మొదట లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర ₹89,900గా నిర్ణయించగా, ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ స్పెషల్ ఆఫర్‌లో కేవలం ₹67,990కే లభిస్తోంది. అంటే ₹21,910 వరకు నేరుగా తగ్గింపు లభిస్తుంది.
అదే కాకుండా యాక్సిస్ బ్యాంకు (Axis Bank) క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ పై కొనుగోలు చేస్తే అదనంగా ₹4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మొత్తం తగ్గింపు ₹25,910 వరకు చేరుతుంది. ఈ ఆఫర్‌ద్వారా ఐఫోన్ 16 ప్లస్ ను కేవలం ₹63,900కి పొందే అవకాశం లభిస్తోంది.
26
ఎక్స్చేంజ్ ఆఫర్ తో మరింత తగ్గింపు
రిలయన్స్ డిజిటల్, కొత్త ఫోన్ కొనే కస్టమర్లకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చితే, డివైస్ మోడల్, కండిషన్‌ను బట్టి ₹26,000 వరకు అదనపు లాభాలు అందిస్తోంది. దీని వల్ల మొత్తం సేవింగ్స్ మరింత పెరుగుతాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకు మాత్రమే లభిస్తాయి కాబట్టి, ఐఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
36
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ లో 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ ( Super Retina XDR OLED) డిస్ప్లే ఉంది. ఇది ఎండలో కూడా అద్భుతమైన విజిబిలిటీని ఇస్తుంది. ఫోన్‌లో ఆపిల్ తాజా A18 చిప్‌సెట్ ఉపయోగించారు. ఆపిల్ ఏఐ (Apple Intelligence) ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఈ చిప్ వేగం, పవర్ ఎఫిషియెన్సీ, గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ కూలింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
ఐఫోన్ 16 ప్లస్ కెమెరా, ఫోటోగ్రఫీ పనితీరు ఎలా ఉంది?
ఫోటో, వీడియోల కోసం ఐఫోన్ 16 ప్లస్ లో శక్తివంతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ రెండు లెన్స్‌లు కలిపి హై డెఫినిషన్ ఫోటోలు తీసుకోవడంతో పాటు వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా 12MP రెసల్యూషన్ కలిగి ఉంది. ఫేస్ టైమ్ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం బెస్ట్ పనితీరును చూపిస్తుంది.
56
ఐఫోన్ 16 ప్లస్ బ్యాటరీ, డిజైన్, భద్రతా ఫీచర్లు
ఐఫోన్ 16 ప్లస్ 4674mAh బ్యాటరీతో వస్తుంది. మంచి ప్రాసెసర్ ఉండటంతో మీకు లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. IP68 రేటింగ్ ఉన్నందున ఈ ఫోన్ నీరు, దుమ్ము, ధూళి నుండి రక్షణ పొందుతుంది. కొత్త థర్మల్ డిజైన్ గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. దీంతో మీరు నాన్ స్టాప్ గా ఫోన్ ను ఉపయోగించవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ మోడల్ బ్లాక్, వైట్, పింక్, టియల్ అల్ట్రామెరైన్ వంటి ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
66
దీపావళి తర్వాత ఐఫోన్ 16 ప్లస్ పై సూపర్ డీల్
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ పై రిలయన్స్ డిజిటల్ ఇచ్చిన ఈ భారీ ఆఫర్, దీపావళి తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి అద్భుతమైన అవకాశంగా మారింది. ₹25,910 వరకు మొత్తం తగ్గింపు, ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్.. ఇలా అన్నీ కలిపి ఈ డీల్‌ను మార్కెట్లో అత్యంత ఆకర్షణీయంగా మార్చాయి.
కెమెరా, పనితీరు, బ్యాటరీ లైఫ్ విషయంలో టాప్ క్లాస్ ఫీచర్లు, తక్కువ ధరలోనే కావాలనుకునే వారికి ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.