Flipkart Sale ASUS Laptops: అస్సలు మిస్ కావద్దు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై రూ. 21 వేల డిస్కౌంట్

Published : Oct 15, 2026, 10:10 AM IST

Flipkart Sale ASUS Laptops: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌పర్ట్‌బుక్ సిరీస్‌పై రూ. 21,000 వరకు తగ్గింపుతో పాటు ధరలు రూ. 49,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆ వివరాలు మీకోసం.

PREV
16
అస్సలు మిస్ కావద్దు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్

ఫెస్టివల్ సీజన్‌లో కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ కంపెనీ ఆసుస్ తన ఎక్స్‌పర్ట్‌బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా ఈ బంపర్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సేల్‌లో కస్టమర్లు కొన్ని ప్రత్యేక ల్యాప్‌టాప్‌లపై రూ. 21,000 వరకు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ, పాత ల్యాప్‌టాప్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా సపరేట్‌గా దక్కుతాయి. ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర కేవలం రూ. 49,990 మాత్రమే.

26
ఏయే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

ఆసుస్ ప్రకటించిన ఈ లేటెస్ట్ ఆఫర్లలో ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ పీ1, పీ3, పీ5 అలాగే ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా సిరీస్ మోడల్స్ ఉన్నాయి. ఆఫీస్ పనులు, బిజినెస్ వర్క్స్, ఆన్‌లైన్ మీటింగ్స్, డైలీ ప్రొఫెషనల్ యూజ్ కోసం వీటిని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. ఎవరి బడ్జెట్, ఏ అవసరానికి తగినట్లుగా వారికి నచ్చేలా వేర్వేరు కాన్ఫిగరేషన్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ల్యాప్‌టాప్ రేంజ్ రూ. 49,990 బేస్ మోడల్ నుంచి మొదలై రూ. 3,49,990 ప్రీమియం ల్యాప్‌టాప్ వరకు ఉన్నాయి.

36
ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ పీ1, పీ3 సిరీస్ ధరలు

అతి తక్కువ ధర ఉన్న ఆప్షన్‌గా ఎక్స్‌పర్ట్‌బుక్ పీ1 14 అంగుళాల మోడల్ నిలుస్తోంది. ఇందులో ఇంటెల్ కోర్ 3-100యూ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ లభిస్తాయి. దీని ధర రూ. 49,990గా ఉంది. ఇదే సిరీస్‌లో 16జీబీ ర్యామ్ మోడల్ రూ. 61,990కి, కోర్ 5-210హెచ్ ప్రాసెసర్, 16జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 67,990గా ఉన్నాయి. 32జీబీ ర్యామ్ ఉన్న సెలెక్టెడ్ పీ1 మోడల్ ధర రూ. 71,990గా ఉంది. 15.6 అంగుళాల స్క్రీన్ ఉన్న పీ1 కూడా రూ. 49,990 నుంచే స్టార్ట్ అవుతుంది. బడ్జెట్‌కు కొంచెం అదనంగా చూస్తే పీ3 మోడల్స్ కూడా సూపర్ ఆప్షన్స్‌గా ఉన్నాయి. 14 అంగుళాల కోర్ అల్ట్రా 5 మోడల్ ధర రూ. 78,990 కాగా, కోర్ అల్ట్రా 7 వేరియంట్స్ రూ. 88,990కి అందుబాటులో ఉన్నాయి. మెటల్ బాడీతో వచ్చే 14 అంగుళాల మోడల్ ధర రూ. 94,990 నుంచి మొదలవుతుంది.

46
ఎక్స్‌పర్ట్‌బుక్ పీ5, ఓఎల్ఈడీ డిస్‌ప్లే విశేషాలు

ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ పీ5 సిరీస్‌లో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఆప్షన్ కూడా ఇచ్చారు. 14 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్, కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ ఉన్న మోడల్ ధర రూ. 92,990గా ఉంది. అలాగే 16 అంగుళాల ఓఎల్‌ఈడీ మోడల్ ధర కూడా రూ. 92,990 నుంచే ప్రారంభమవుతుంది. కోర్ అల్ట్రా 7, 16జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్‌డీ కలిగిన 16 అంగుళాల వేరియంట్ ధర రూ. 1,19,990గా ఉంది. మరింత పవర్‌ఫుల్ మోడల్స్ రూ. 1,79,990 ధరలో అందుబాటులో ఉన్నాయి.

56
ఆసుస్ ప్రీమియం ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు

ప్రీమియం రేంజ్ విషయానికి వస్తే ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా సిరీస్ హైలైట్‌గా నిలుస్తోంది. దీనిలో 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ మోడల్ ధర రూ. 1,79,990గా ఉంది. 32జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్ రూ. 2,69,990కి, అలాగే 64జీబీ ర్యామ్, 2టీబీ ఎస్ఎస్‌డీ మోడల్ రూ. 3,49,990కి లభిస్తున్నాయి. ఈ సిరీస్‌లో 14 అంగుళాల 3కే ట్యాండమ్ ఓఎల్‌ఈడీ టచ్‌స్క్రీన్ ఇచ్చారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ల్యాప్‌టాప్ అత్యంత తేలికైన మోడల్ బరువు కేవలం సుమారు 0.99 కిలోలు మాత్రమే ఉంటుంది.

66
అదనపు బ్యాంక్ ఆఫర్లు, వారంటీ వివరాలు ఇవే

ఈ సేల్‌లో కొన్ని ప్రత్యేక ల్యాప్‌టాప్‌లపై రూ. 10,000 వరకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. చాలా మోడల్స్‌తో పాటు విండోస్ 11, ఆఫీస్ 2024, ఒక ఏడాది మెకాఫీ సేఫ్టీ, ఆన్‌సైట్ వారంటీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఈ ఆఫర్లు అన్ని మోడల్స్‌కూ వర్తించకపోవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందే ఆఫర్ వివరాలను కస్టమర్లు నేరుగా చెక్ చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories