AI Plus Nova 2 5G: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.12 వేల బడ్జెట్‌లో 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో AI+ Nova 2 5G ఫ్లిప్‌కార్ట్ సేల్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఫూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ హంగామా నడుస్తోంది. రోజూ రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో పండగ వాతావరణం కనిపిస్తోంది. అయితే, ఈ సేల్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఒక క్రేజీ డీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ బడ్జెట్‌లో సూపర్ 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారి కోసం AI+ బ్రాండ్ తన కొత్త మోడల్ "AI+ Nova 2 5G" ను మార్కెట్లోకి తెచ్చింది.
సాధారణ రోజుల్లో రూ. 13,999 గా ఉన్న ఈ ఫోన్ ధర, సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో కలిపి కేవలం రూ. 11,999 కే లభిస్తోంది. రూ. 12 వేల లోపే 5G నెట్‌వర్క్, హై-స్పీడ్ ఇంటర్నెట్ వాడుకునే ఛాన్స్ లభించడంతో టెక్ లవర్స్ ఈ ఫోన్ వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
25
క్లారిటీ ఫోటోల కోసం 50MP కెమెరా
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెయిన్ హైలైట్ దీని కెమెరా సెటప్ అని చెప్పవచ్చు. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాను అందించారు. దీని ద్వారా ప్రతీ రోజూ తీసే ఫోటోలు, వీడియోలు చాలా స్పష్టంగా, మంచి డిటైలింగ్‌తో వస్తాయి. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే క్షణాలను, నేచర్ వ్యూస్‌ను క్యాప్చర్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడటానికి వీలుగా ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాను ఇచ్చారు. రీల్స్ చేసేవారికి, సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోలు పోస్ట్ చేసేవారికి ఈ కెమెరా సెటప్ చక్కగా సరిపోతుంది.
35
స్మూత్ స్క్రోలింగ్.. 120Hz పెద్ద డిస్‌ప్లే
ఫోన్ స్క్రీన్ విషయంలో AI+ కంపెనీ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. ఇందులో 6.745 అంగుళాల పెద్ద HD+ V-నాచ్ డిస్‌ప్లేను ఇచ్చారు. 720 x 1600 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో వచ్చే ఈ స్క్రీన్‌లో మూవీస్, యూట్యూబ్ వీడియోలు చూడటం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది.
ముఖ్యంగా ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. దీనివల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా సోషల్ మీడియా యాప్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు స్క్రీన్ ఎంతో స్మూత్‌గా, ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో 120Hz డిస్‌ప్లే రావడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.
ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా యూనిసాక్ T8200 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 2.3 GHz క్లాక్ స్పీడ్‌తో రన్ అవుతుంది. డైలీ టాస్క్స్ అయిన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వాడటం, వీడియోలు చూడటం, నార్మల్ గేమింగ్ వంటి వాటిని ఈ ఫోన్ ఈజీగా హ్యాండిల్ చేయగలదు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇక మొబైల్ వేరియంట్ల విషయానికి వస్తే 4GB RAM / 6GB RAM ఆప్షన్లు, 64GB / 128GB ఇన్బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 1TB వరకు పెంచుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.
55
6000mAh భారీ బ్యాటరీ, ఐపీ64 రేటింగ్
ఈ ఫోన్‌ను మరింత స్పెషల్‌గా మార్చేది దీని భారీ బ్యాటరీ. ఇందులో 6000mAh లిథియం పాలిమర్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడేయవచ్చు. బాక్స్‌లో 10W ఛార్జర్, టైప్-C డేటా కేబుల్ ఇస్తున్నారు. ప్రొటెక్షన్ కోసం TPU కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్ కూడా ఇన్‌బాక్స్‌లోనే వస్తాయి.
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తోంది. పింక్, గ్రీన్, పర్పల్, బ్లూ, బ్లాక్ వంటి కలర్లలో ఇది లభిస్తుంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ v5.0 వంటి అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న 5G ఫోన్ కావాలనుకునే వారికి AI+ Nova 2 5G ఒక బెస్ట్ ఆప్షన్.