Published : Oct 11, 2026, 04:43 PM ISTUpdated : Oct 11, 2026, 05:21 PM IST
Kitchen Gadgets: కుక్కర్లు, కళాయిలు, ప్యాన్లు వంటి పాత్రలకు హ్యాండిల్స్ ఉంటాయి. లేని వాటి కోసం పట్కర్లను ఉపయోగిస్తుంటాం. అయితే మారి కాలంతో పాటు ఇవి కూడా స్మార్ట్‌గా మారాయి. ఇలాంటి ఒక స్మార్ట్ ప్రొడక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో FEBZONA డిటాచబుల్ పాట్ హ్యాండిల్ పేరుతో ఈ ప్రొడక్ట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1799 కాగా ప్రస్తుతం 65 శాతం డిస్కౌంట్‌తో రూ. 629కి లభిస్తోంది. ఈ ప్రొడక్ట్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని పాత్రకు అవసరమైనప్పుడు మాత్రమే అమర్చుకోవచ్చు. వంట చేసేటప్పుడు లేదా పాత్రను ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చేటప్పుడు హ్యాండిల్ ఉపయోగపడుతుంది. పని పూర్తయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు. దీనివల్ల ప్రతి పాత్రకు ప్రత్యేకంగా హ్యాండిల్ ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ఈ హ్యాండిల్‌ను ఉపయోగించే ముందు పాత్ర అంచులకు సరిగ్గా సరిపోతుందో లేదో పరిశీలించాలి.
25
వంటగదిలో స్థలం ఆదా
చిన్న వంటగదుల్లో పాత్రలను సర్దుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. హ్యాండిల్స్ కారణంగా పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టడానికి ఇబ్బంది కలగవచ్చు. ఈ డిటాచబుల్ హ్యాండిల్‌ను తొలగించిన తర్వాత పాత్రలను సులభంగా పేర్చుకోవచ్చు. హ్యాండిల్స్ తొలగించి సర్దుకోవడం ద్వారా 70 శాతం వరకు ఎక్కువ స్థలాన్ని ఆదా చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
ఈ హ్యాండిల్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్, సిలికాన్ పదార్థాలను ఉపయోగించారు. చేతికి సౌకర్యంగా ఉండేలా వంపుతో కూడిన ఆకృతిని రూపొందించారు. హ్యాండిల్‌పై ఉన్న గీతలతో కూడిన భాగం చేతికి పట్టును అందించడంలో సహాయపడుతుంది. అలాగే పాత్రకు అమర్చినప్పుడు గట్టిగా బిగుసుకునేలా లాకింగ్ వ్యవస్థను అందించారు. అయితే ఉపయోగించే ముందు పాత్ర బరువుకు ఈ హ్యాండిల్ సరిపోతుందో కూడా నిర్ధారించుకోవాలి.
వంట పూర్తయిన తర్వాత హ్యాండిల్‌ను తొలగించి విడిగా భద్రపరచుకోవచ్చు. దీనివల్ల పాత్రలను అల్మారాల్లో, క్యాబినెట్లలో సర్దుకోవడం సులభమవుతుంది. హ్యాండిల్ తొలగించగలిగే విధంగా ఉండటంతో శుభ్రం చేసుకోవడం కూడా సౌకర్యంగా ఉంటుంది. దీని పొడవు 18.2 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు. చిన్న ఇళ్లలో నివసించేవారికి, తక్కువ స్థలంలో ఎక్కువ పాత్రలను సర్దుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ హ్యాండిల్‌ను నిలువుగా ఉండే అంచులు కలిగిన కొన్ని వంట పాత్రలకు అమర్చుకునేలా రూపొందించారు. అయితే ప్రతి కుక్కర్, పాన్ లేదా కడాయికి ఇది సరిపోతుందని చెప్పలేం. కొనుగోలు చేసే ముందు పాత్ర అంచుల ఆకృతి, మందం, బరువు వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే వేడి పాత్రలను ఎత్తేప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.