రూ. 6 వేల బ‌డ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్లు చ‌వ‌కే చ‌వ‌క

Published : Aug 29, 2025, 12:25 PM IST

స్మార్ట్‌ఫోన్ లేక‌పోతే రోజు గ‌డ‌వ‌లేని ప‌రిస్థితి ఉంది. పెరిగిన పోటీ నేప‌థ్యంలో కంపెనీలు సైతం డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
POCO C71

పోకో సీ71 స్మార్ట్ ఫోన్ అస‌లు ధ‌ర రూ. 8999కాగా 34 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 5899కే సొంతం చేసుకోవ‌చ్చు. ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 64 జీబీ స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌ను అందించారు. 6.8 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇందులో 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాట‌రీ విష‌యానికొస్తే ఇందులో 5200 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందించారు.

25
MOTOROLA g05

ఫ్లిప్‌కార్ట్‌లో త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులో ఉన్న మ‌రో బెస్ట్ ఫోన్ మోటోరోలా జీ05 ఒక‌టి. ఈ ఫోన్ అస‌లు ధ‌ర రూ. 9,999కాగా 30 శాతం డిస్కౌంట్‌తో రూ. 6,999కి ల‌భిస్తోంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 6.67 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. కెమెరా విష‌యానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమ‌రీ కెమెరాను ఇచ్చారు. అలాగే 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 5100 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందించారు. ఈ ఫోన్ హీలియో జీ81 ప్రాసెస‌ర్‌తో ప‌నిచేస్తుంది.

35
Ai+ Pulse

ఏఐ+ స్మార్ట్ ఫోన్ అస‌లు ధ‌ర రూ. 7999కాగా 31 శాతం డిస్కౌంట్‌తో రూ. 5499కి ల‌భిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. 6.7 ఇంచెస్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. కెమెరా విష‌యానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఈ ఫోన్ సొంతం.

45
Samsung Galaxy F05

సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎఫ్‌05 స్మార్ట్ ఫోన్ అస‌లు ధ‌ర రూ. 9,999కాగా 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 6499కి ల‌భిస్తోంది. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 6.74 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. కెమెరా విష‌యానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. అలాగే 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందించారు.

55
Redmi A3x

రెడ్‌మీ ఏ3ఎక్స్ స్మార్ట్ ఫోన్ అస‌లు ధ‌ర రూ. 9,999 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 40 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 5999కి సొంతం చేసుకోవ‌చ్చు. ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 64 జీబీ స్టోరేజ్‌, 3 జీబీ ర్యామ్‌ను అందించారు. 6.71 ఇంచెస్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. కెమెరా విష‌యానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories