Upcoming Mobiles: వివో, మోటరోలా, ఐటెల్, సామ్‌సంగ్, హానర్ కంపెనీలు ఈ వారంలో భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ మోడళ్లతో రాబోతున్నాయి. వాటి స్పెసిఫికేషన్లు, లాంచ్ తేదీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వివో కంపెనీ తన కొత్త మిడ్‌రేంజ్ మోడల్ Vivo T4 Pro ను ఆగస్ట్ 26న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 3x పెరిస్కోప్ లెన్స్, 50MP ప్రధాన కెమెరాతో ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. డిజైన్ పరంగా గోల్డ్, నైట్రో బ్లూ రంగుల్లో ఇది లభిస్తుంది.
200 గ్రాముల లోపు బరువుతో, స్లిమ్ బాడీ, క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో ఇది ప్రీమియం లుక్ లో వస్తోంది. ధర రూ.30,000లోపు ఉండే అవకాశం ఉంది. కెమెరా ఫీచర్లలో ముఖ్యమైంది 20x జూమ్ వరకు పని చేయడం. అలాగే, వీడియో రికార్డింగ్ 4K 30fps వరకు సపోర్ట్ చేస్తుంది.
మోటరోలా రెజర్ 60 Swarovski Edition, Moto Buds Loop ను సెప్టెంబర్ 1న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. Razr 60 మోడల్‌లో 3D లెదర్ ఫినిష్, 35 Swarovski క్రిస్టల్స్ ను కలిగి ఉంటుంది. దీని ధర సుమారు రూ.84,000గా ఉండవచ్చని అంచనా.
Buds Loop Ice Melt ఎడిషన్ కూడా విడుదలవుతుంది. ఈ బడ్స్‌లో Bose ట్యూనింగ్ సౌండ్, స్పేషియల్ ఆడియో, 36 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. Buds Loop ధర సుమారు రూ.27,000గా ఉండే అవకాశం ఉంది. రెండు మోడల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
35
3. ఐటెల్ జెనో 20 (Itel Zeno 20)
ఐటెల్ కంపెనీ Itel Zeno 20 మోడల్‌ను ఆగస్ట్ 25న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇది 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Unisoc T7100 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ 3GB/4GB RAM, 64GB/128GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
13MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో ఈ మోడల్ లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్‌తో కూడిన Aivana 2.0 AI అసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ధర రూ.5,999 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.
సామ్‌సంగ్ గెలాక్సీ S25 FE భారత మార్కెట్‌లో లాంచ్ అవుతుందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. 6.7 అంగుళాల Dynamic AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం.
Exynos 2400 ప్రాసెసర్, Android 16 ఆధారిత One UI 8 తో ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్, 8MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉండనుంది.
55
5. హానర్ మ్యాజిక్ 8 సిరీస్ (Honor Magic 8 Series)
హానర్ మ్యాజిక్ 8 సిరీస్ భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. ఈ సిరీస్‌లో Magic 8, Magic 8 Pro, Magic 8 Mini, Magic 8 Max మోడల్స్ వస్తాయి. మొదట స్టాండర్డ్, ప్రో వెర్షన్లు మాత్రమే విడుదల అవుతాయని సమాచారం. Magic 8 Pro Snapdragon 8 Elite 2 చిప్‌సెట్‌తో రానుంది.
50MP OV50Q ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 200MP టెలిఫోటో లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇందులో ఉంటాయని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్‌ప్లే 6.7 అంగుళాలు ఉండగా, Magic 8 Max మోడల్‌లో 6.9 అంగుళాల స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.