Flipkart Month End Mobile Festival offers : ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్‌లో సామ్‌సంగ్, వివో, మోటరోలా, నథింగ్ ఫోన్లపై భారీ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ప్రముఖ మొబైల్ బ్రాండ్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
సామ్‌సంగ్, వివో, మోటరోలా, నథింగ్, ఒప్పో వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఎంఆర్పీ కంటే తక్కువ ధరలకు లభిస్తున్నాయి. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, కూపన్ డిస్కౌంట్లను కూడా వినియోగదారులకు అందిస్తోంది.
25
ఫ్రీడమ్ సేల్ తర్వాత ఫ్లిప్ కార్ట్ లో మరో మెగా ఆఫర్ డీల్స్
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 విజయవంతంగా నిర్వహించింది. ఆ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అందించారు. ఇప్పుడు, మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
35
బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ సౌకర్యం
ఫ్లిప్‌కార్ట్ తన మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 2,500 వరకు అదనపు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదనంగా, పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కల్పించారు.
ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా కలిసి ఉన్నాయి.
55
వినియోగదారుల కోసం మంచి అవకాశం
స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ మంచి అవకాశం. హైఎండ్ ఫోన్ల నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల వరకు విస్తృతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత తగ్గింపులు వినియోగదారుల ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయి. మీరు కొత్త ఫోన్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉంటే ఒకసారి లుక్కేయండి !