ఆ రాశివారు స్పైసీ ఫుడ్ అంటే పడిచచ్చిపోతారు..!

First Published | May 8, 2021, 11:04 AM IST

ఆకలి తీరడానికి అందరం ఏదో ఒకటి తింటూ ఉంటాం. అయితే.. తినే ఆహారంలో మాత్రం తేడాలు ఉంటాయి. ఎవరి ఇష్టాన్ని పట్టి వారు తినేస్తూ ఉంటారు. అయితే.. మీ రాశి చక్రాన్ని బట్టి.. ఏ రాశివారికి ఎలాంటి ఆహారం ఇష్టమో సులభంగా చెప్పేయవచ్చట.

పొట్టకూటి కోసం కోటి విద్యలు అని చెప్పారు పెద్దలు. ఎవరు ఎంత సంపాదించినా.. ఎంత కష్టపడినా.. ఆ జానెడు పొట్ట నింపుకోవడానికే. అయితే.. ఆకలి తీరడానికి అందరం ఏదో ఒకటి తింటూ ఉంటాం. అయితే.. తినే ఆహారంలో మాత్రం తేడాలు ఉంటాయి. ఎవరి ఇష్టాన్ని పట్టి వారు తినేస్తూ ఉంటారు. అయితే.. మీ రాశి చక్రాన్ని బట్టి.. ఏ రాశివారికి ఎలాంటి ఆహారం ఇష్టమో సులభంగా చెప్పేయవచ్చట. మరి మీకు నచ్చే ఆహారం ఏంటో ఓసారి చూసేద్దామా..
1.కుంభ రాశి..ఈ రాశివారికి ఇంట్లో తయారు చేసే భోజనం అంటే విపరతీంగా ఇష్టపడతారు. వీరికి బ్రిటీష్ సంస్కృతి మీద ఆసక్తి ఎక్కువ. బ్రిటీష్ సంస్కృతికి సంబంధించిన కొత్త రకాల వంటలను రుచి చూడటానికి ఇష్టపడతారు. వాటిని తయారు చేయడానికి కూడా ఎక్కవ ఇంట్రెస్ట్ చూపిస్తారు.

2.మేష రాశి..ఈ రాశివారు ఏ వంటకమైనా కారంగా తినడం అంటే.. స్పైసీ ఫుడ్ అంటే పడి చచ్చిపోతారు. ఈ రాశివారు డిస్టర్స్, చల్లగా ఉంటే ఆహారాలను పెద్దగా ఇష్టపడరు.
3.కర్కాటక రాశి..ఈ రాశివారికి సీ ఫుడ్ ఎక్కువగా ఇష్టం. ముఖ్యగా టర్కిష్ ఫుడ్ ని తినడానికి వీరు ఆసక్తి చూపిస్తుంటారు.
4.మకర రాశి.. ఈ రాశివారికి కూడా హాట్ గా, స్పైసీగా ఉండే ఆహారం ఇష్టం. వీరికి మెక్సికో ఫుడ్స్ బాగా నచ్చుతాయి.
5.మిథున రాశి.. ఈ రాశివారికి సహజమైన ఆహారం తినడం ఇష్టం. ఎక్కువగా సలాడ్స్ లాంటివి తినడానికి ఇష్టపడతారు.
6.సింహ రాశి.. ఈ రాశివారు ఫుడ్ ప్రియులు. ఆహారాన్ని చాలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. రుచికరమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారికి ఇటాలియన్ ఫుడ్స్ అంటే ఎక్కువ ఇష్టం.
7.తుల రాశి.. ఈ రాశివారు ఫుడ్ ప్రియులు. తాజా ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరికి జపనీస్ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
8.మీన రాశి.. ఈ రాశివారికి కూడా ఎక్కువగా సీ ఫుడ్ అంటే ఇష్టం. ఇవి కాక కరేబియన్ ఫుడ్ ని ఇష్టపడతారు.
9.ధనస్సు రాశి... ఈ రాశివారికి ఏదైనా కొత్తగా రుచి చూడాలని ఆశపడతారు. కాబట్టి.. ఇష్టంతో పనిలేకుండా.. ఏది కొత్తగా...చూడటానికి ఆకర్షణీయంగా కనపడుతుందో దానిని తినేస్తారు.
10. వృశ్చిక రాశి.. ఈ రాశివారికి స్వీట్లంటే ఎక్కువగా ఇష్టం. అయితే.. ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిపెడతారు. ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే ఆహారం తినడానికి ఆసక్తి చూపిస్తారు.
11.వృషభ రాశి.. ఈ రాశివారికి సహసిద్ధమైన ఆహారం తినడానికి ఇష్టపడతారు. బయట కన్నా.. సొంతంగా పెరట్లో పండిన కూరగాయలు తినడానికి ఇష్టపడతారు.
12.కన్య రాశి.. ఈ రాశివారు ఆహార ప్రియులు. రుచికరమైన ఆహారం ఏదైనా కమ్మగా ఆస్వాదిస్తారు.

Latest Videos

click me!