జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా..?

First Published May 7, 2021, 10:05 AM IST

మన ఇంట్లో పెద్వారు మాత్రం చికెన్ పెట్టడానికి ఒప్పుకోరు. ఆ సమయంలో చికెన్ తింటే కామెర్లకు దారితీస్తుందేమోనని వారి భయం. మరి  ఇందులో నిజమెంత..? చికెన్ తినొచ్చా..? తినకూడదా..? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు  చూద్దాం..

బలహీనంగా ఉన్న సమయంలోనూ.. ఏదైనా వ్యాధి బారినపడినప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ ఉండే మంచి బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలా తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం తగ్గి.. మళ్లీ తిరిగి శక్తివంతులౌతారు. జ్వరం వచ్చినప్పుడు కూడా వైద్యులు కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకోమని చెబుతారు. లైట్ ఫుడ్ తీసుకుంటే అరుగుదల మంచిగా ఉంటుందని.. దాని వల్ల ఎలాంటి సమస్యఉండదు అని వారు అలా చెబుతారు.
undefined
అయితే.. జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మన ఇంట్లో పెద్వారు మాత్రం చికెన్ పెట్టడానికి ఒప్పుకోరు. ఆ సమయంలో చికెన్ తింటే కామెర్లకు దారితీస్తుందేమోనని వారి భయం. మరి ఇందులో నిజమెంత..? చికెన్ తినొచ్చా..? తినకూడదా..? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
undefined
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే.. చికెన్ ఎలా తీసుకుంటున్నారనేది మాత్రం చాలా ముఖ్యమట.
undefined
నార్మల్ రోజల్లోలాగా.. ఆయిల్ లో ఫ్రై చేసిన చికెన్.. లేదా స్పైసెస్ ఎక్కువగా ఉండే చికెన్ తినకూడదట. తక్కువ ఆయిల్ తో.. స్పైసెస్ తక్కువగా ఉండేలా చేసిన చికెన్ ని అయితే.. ఎలాంటి డౌట్స్ లేకుండా తినేయవచ్చట.
undefined
కర్రీలాగా కాకుండా... చికెన్ సూప్స్ బెస్ట్ ఆప్షన్. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ సూప్స్ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రియన్స్ పుష్కలంగా అందుతాయి.
undefined
జ్వరంలో ఉన్నామనే భయం కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. జ్వరం సమయంలో శరీరం డీ హైడ్రేడ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు సూప్స్ తాగడం వల్ల డీ హైడ్రేడ్ కాకుండా కూడా ఉంటుంది.
undefined
గ్రిల్డ్ చికెన్, రోస్టెడ్ చికెన్, చికెన్ స్ట్యూ, బేక్డ్ చికెన్ టిక్కా, కినోవా చికెన్, చికెన్ తుక్పా లాంటి వాటిని కూడా తినొచ్చు.
undefined
నూనెలో వేయించిన ఫ్రైడ్ చికెన్, క్రిస్పీ చికెన్ ఇలాంటివి మాత్రం అస్సలు తినకూడదు. ఇలాంటి చికెన్ తింటే నిజంగానే శరీరానికి చాలా అనారోగ్యం కలుగుతుంది.
undefined
చికెన్ నగ్గెట్స్, బటర్ చికెన్, మసాలా, చికెన్ లాలీపాప్, చిల్లీ చికెన్ ఇలాంటివి మాత్రం అస్సలు తినకూడదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
undefined
click me!