ఈ కరోనా టైంలో ఆరోగ్యంగా ఉండాలా..? ఈ జ్యూస్ తాగాల్సిందే..!

First Published | May 7, 2021, 3:13 PM IST

పాలకూర జ్యూస్ తాగడం వల్ల కంటిచూపుకు చాలా మంచిది. అంతేకాకుండా.. అరుగుదల సమస్యలు కూడా తగ్గుపోతాయి.
 

ప్రస్తుతం కరోనా విపరీతంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే.. ఆ ఆరోగ్యం పాలకూర తో లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దాదాపు అందరూ చలికాలంలో పాలకూర తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. నిజానికి దానికి ఎండాకాలం తినడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో యాంటీ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కాక పాలకూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

పాలకూరలో కాల్షియం, సోడియం, పాస్పరస్, ఐరన్, మినరల్ సాల్ట్స్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ లాంటి పోషకాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రతిరోజూ పాలకూర జ్యూస్ తాగమని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది.
పాలకూర జ్యూస్ తాగడం వల్ల కంటిచూపుకు చాలా మంచిది. అంతేకాకుండా.. అరుగుదల సమస్యలు కూడా తగ్గుపోతాయి.
పాలకూర జ్యూస్ తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. దీనిలో కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బలహీనంగా ఉండేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అందుకే పాలకూరను కచ్చితంగా మీ డైట్ లో భాగం చేసుకోవాలని నిపుణలు చెబుతున్నారు.
పాలకూర జ్యూస్ తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీనిని తాగడం వల్ల శరీరంలోని చెడు పదార్థాలన్నీ బయటకు పోతాయి.
ఈ జ్యూస్ తాగడం వల్ల పొట్ట లైట్ గా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతోంది.
పాలకూర జ్యూస్ లోని విటమిన్ ఏ, విటమిన్ సీ.. కంటి చూపుకు చాలా అవసరం. కంటి ఇన్ఫెక్షన్లు తగడానికి కూడా సహాయం చేస్తుంది.
అధిక బరువు, ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నవారు ఈ జ్యూస్ తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు.
రోగ నిరోధక శక్తి పెరుగుదలకు కూడా సహాయం చేస్తుంది.

Latest Videos

click me!