ఈ పిండితో చేసిన రొట్టెలను తింటే తొందరగా బరువు తగ్గుతారు

First Published | Oct 7, 2023, 11:24 AM IST

బరువు తగ్గాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి.  బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో పండ్లను, ఆకుకూరలను, తృణధాన్యాలను చేర్చుకోవడం మంచిది. అయితే కొన్ని రకాల పిండితో చేసిన రొట్టెలను తిన్నా కూడా తొందరగా బరువు తగ్గుతారు. 
 

బరువు తగ్గాలంటే అన్నాన్ని తినడం చాలా తగ్గించాలి. ఎందుకంటే అన్నంలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బరువును అమాంతం పెంచేస్తాయి. అందుకే బరువు పెరగకూడదు, తగ్గాలనుకునే వారు అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలను తింటుంటారు. అయినా ప్రస్తుత కాలంలో చాలా ఇండ్లలో గోధుమ రొట్టెలను తింటున్నారు. వేడి వేడి రొట్టెతో కూరలు మరింత రుచిగా అనిపిస్తాయి. అయితే బరువు తగ్గడానికి కని ఏ పిండి రొట్టెలను పడితే ఆ పిండి రొట్టెలను తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల పిండిలు కూడా బరువును పెంచుతయ్.  మరి బరువు తగ్గడానికి ఎలాంటి పిండితో చేసిన రొట్టెలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జొన్న రొట్టె

చిరుధాన్యాలలో ఒకటైన జొన్నల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే గోధుమ రొట్టెలకు బదులుగా జొన్నలతో చేసిన రొట్టెలను తినండి. ఇది మీ బరువును ఆరోగ్యంగా తగ్గించడానికి సహభాయపడుతుంది. బరువు తగ్గడంతో పాటుగా డయాబెటిస్ సమస్యను నియంత్రించడానికి సజ్జలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. పోషకాలు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలు తక్కువ జిఐని కలిగి ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి.
 


ఓట్స్

ఓట్స్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి ఎన్నో రకాల పోషకాలుంటాయి. మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మీ రోజువారి ఆహారంలో ఓట్స్ పిండితో చేసిన రొట్టెలను తినండి. డయాబెటిస్ సమస్యలు ఉన్నవారికి కూడా ఓట్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

besan

శెనగ పిండి

శెనగపిండి ప్రోటీన్ల భాండాగారం. ఈ పిండిలో ఫైబర్ కంటెంట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. అలాగే దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గడానికి ఈ పిండి ఎంతో సహాయపడుతుంది. ఈ పండిలో ఐరన్, ఫోలేట్ లు కూడా ఉంటాయి. ఇది మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి శెనగపిండి రొట్టెలను కూడా తినొచ్చు.
 

క్వినోవా

క్వినోవా మంచి పోషకాలకు మూలం. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. క్వినోవాలో ఫోలేట్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. క్వినోవా పిండి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. క్వినోవా పిండితో చేసిన వంటకాలను  మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

Latest Videos

click me!