మోసాంబిలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ జ్యూస్ ను సీజన్లతో సంబంధం లేకుండా తాగొచ్చు. ఈ పండ్లు ఏడాది పొడవునా మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి,కాల్షియం, పొటాషియం, ఫోలేట్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇలాంటి పండు జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. అసలు ఈ జ్యూస్ ను తాగితే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి..
బరువు తగ్గేందుకు ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారికి మోసాంబిలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును ఈ పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మోసాంబి జ్యూస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతో సహయపడుతుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం..
నీళ్లను తక్కువగా తాగడం నుంచి ఫైబర్ ను తీసుకోకపోవడం వరకు.. మలబద్దకానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మోసాంబి జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మలబద్దకం సమస్య ఇట్టే తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పండులో ఉండే యాసిడ్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తి బలంగా..
మోసాంబిలు పోషకాల నిధి. ఇదిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తాగితే మనం ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటాం.
mosambi juice
ఎముకలు దృఢంగా..
మోసాంబిలు మన ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మోసాంబి జ్యూస్ పుష్కలంగా ఉండే క్యాల్షియం మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీకు కీళ్ల నొప్పులు ఉంటే మోసాంబి జ్యూస్ ను రెగ్యులర్ గా తాగండి. ఇది నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
mosambi
చర్మానికి మేలు..
తులసి జ్యూస్ మన చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో ఉండే విటమిన్ సి స్కిన్ కలర్ ను మెరుగుపరుస్తుంది. అలాగే మొటిమలు, మొటిమల మచ్చలను తగ్గిస్తుంది.