వేడి వేడి పకోడీ.. గరమ్ గరమ్ ఛాయ్.. ఇది మీ కిష్టమైనా కాంబినేషనా? అయితే డేంజరే అంటున్నారు ఆహార నిపుణులు. ఛాయ్ తో పాటు కలిపి తీసుకోకూడని కొన్ని కాంబినేషన్ల గురించి హెచ్చరిస్తున్నారు.
undefined
మనదేశంలో టీ ఎంత ప్రాముఖ్యం అంటే దీన్ని నేషనల్ డ్రింక్ గా ప్రకటించొచ్చు. హెక్టిక్ వర్క్ తో ముగిసిన రోజు చివర్లో ఒక కప్పు టీ ఎంతో స్వాంతన నిస్తుంది. అలాగే ఉదయం లేవగానే, సాయంత్రం, మధ్యాహ్నం లంచ్ తరువాత ఇలా టీ ప్రియులు రిఫ్రెష్ మెంట్ కోసం తాగుతూనే ఉంటారు.
undefined
అయితే పాలతో చేసే చాయ్ తో పాటు ఆరోగ్య స్పృహతో అనేక రకాల ఛాయ్ లు అందుబాటులోకి వచ్చాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ, చమోమిలే టీ, మందార టీ ఇలా లెక్కలేనన్ని టీ రకాలు ఉన్నాయి, ప్రతి దానికీ దాని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి.
undefined
అయితే కొన్నిరకాల పదార్థాలను టీతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి పక్కనపెడితే చెడు ఎక్కువగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి కాంబినేషన్లు ఓ సారి చూడండి.
undefined
ఐరన్ ఎక్కువగా ఉన్న కూరగాయలు : ఐరన్ శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలను టీతో కలపద్దు. లేదా అవి తిన్నవెంటనే టీ తాగకూడదు. దీనివల్ల టీలో ఉండే టానిన్లు, ఆక్సలేట్లు ఆహారపదార్థాల్లోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా నిరోధిస్తాయి.
undefined
ఈ సమ్మేళనాలు ఇనుమును తమతో బంధించి రక్తంలోకి శోషణ కాకుండా అడ్డుపడతాయి. అందుకే ఐరన్ అధికంగా ఉండే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, కాయగూరలు,తృణధాన్యాలు టీతో కలిపి తీసుకోకుండా ఉండడమే మంచిది.
undefined
నిమ్మకాయ : లెమన్ టీ.. బాగా ఎక్కువగా వాడే టీ. బరువు తగ్గడానికి ఈ టీ ఎక్కువగా తాగుతారు. ఉదయం లేవగానే లెమన్ టీ తాగడం చాలామందికి అలవాటు. అయితే ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదంటున్నారు. టీ ఆకులు నిమ్మరసంతో కలిపినప్పుడు టీ ఆమ్లంగా తయారవుతుంది. దీనివల్ల కడుపులో ఉబ్బరం మొదలవుతుంది.
undefined
అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగితే యాసిడ్ రిఫ్లక్స్ అయి గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. మీరు ఇప్పటికే అసిడిటీతో బాధపడుతుంటే, ఈ టీని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది.
undefined
శనగపిండి : సాయంత్రం పూట స్నాక్స్ తో పాటు టీ తాగడం చాలామందికి అలవాటు. ఇలా సాయంత్రం తీసుకునే స్నాక్స్ ఎక్కువగా శనగపిండి లేదా వేరే ఏదైనా పిండితో చేసినవే అయి ఉంటాయి. పకోడీనో, బజ్జీనో, నమ్కీన్ లో ఇలా ఏదైనా సరే.. పిండితో తయారయ్యేదే.
undefined
అయితే శనగపిండి, టీ కాంబినేషన్ కొంతమందికి ఏమీ కాకపోయినా, కొంతమందికి మాత్రం జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు వాటినుంచి లభించే పోషకాలు శరీరంలోకి శోషణ కాకుండా ఆగిపోతాయి. అందుకే ఈ కాంబినేషన్ల ఫుడ్ తీసుకునేప్పుడు ఓ సారి మళ్లీ ఆలోచించుకోవడం మంచిది.
undefined
పసుపు : ఆహారపదార్థాల్లో పసుపు వాడినట్లైతే వాటిని టీతో తీసుకోకపోవడమే మంచిది. పసుపు, టీ ఆకులు ఒకదానికొకటి పడవు. రెండూ కలిసినప్పుడు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
undefined
చల్లటి పదార్థాలు : కొంతమంది ఐస్ క్రీం తిని వెంటనే టీ తాగుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఐస్ క్రీం ఒక్కటే కాదు.. చల్లటి పదార్థాలు ఏవైనా తిని వెంనటే టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రెండు వేర్వేరు ఉష్ణోగ్రతలున్న పదార్థాలను వెంటవెంటనే తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకుండా పోతుంది. దీనివల్ల కడుపులో వికారం కలుగుతుంది. అందుకే టీ తాగిన అరగంట వరకు ఎలంటి చల్లటి పదార్థాలు తీసుకోకపోవడమే మంచింది.
undefined