చాక్లెట్ మ్యాగీ : ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న విచిత్ర వంటకం.. !

First Published | Jun 2, 2021, 1:19 PM IST

కొన్ని విచిత్రమైన కాంబినేషన్లు చూస్తే.. ఒక్కసారి ఇదేంటీ అని బృకుటి ముడిపడుతుంది. అలాంటి  విచిత్రమైన కాంబినేషన్ ఫుడ్డే చాక్లెట్ మ్యాగీ. 

కొన్ని విచిత్రమైన కాంబినేషన్లు చూస్తే.. ఒక్కసారి ఇదేంటీ అని బృకుటి ముడిపడుతుంది. అలాంటి విచిత్రమైన కాంబినేషన్ ఫుడ్డే చాక్లెట్ మ్యాగీ.లాక్ డౌన్ పుణ్యమా అని నిరుడు అనేక రకాల కొత్త కొత్త వంటకాలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. అలాంటి ఓ విచిత్రమైన వంటకమే ఇది.
ఢిల్లీకి చెందిన ఫుడ్ బ్లాగర్ చాహత్ ఆనంద్ ఈ కాంబినేషన్ సృష్టికర్త. ఆమె ఇటీవల మ్యాగీకి ఓరియో కలిపి తయారు చేసి.. దీనిమీద ఐస్ క్రీంతో అలంకరించిన వీడియోను తన ఇన్ స్ట్రా పేజ్ లో షేర్ చేసింది.

అంతే ఇలా షేర్ చేయడం ఆలస్యం అలా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ వీడియో 700 కి పైగా వ్యూస్, 15.8k లైక్స్, మూడువేలకు పైగా కామెంట్లు వచ్చాయి.
ఇంతకీ ఈ వీడియో క్లిప్‌లో ఏముంది. చాక్లెట్ మ్యాగీ ఎలా తయారుచేసింది? అంటే.. ముందు పాన్ లో నీళ్లు మరిగించి.. మ్యాగీని వేసింది. మ్యాగీ మసాలా వాడలేదు. ఆ తరువాత ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ను తీసుకుని.. దీన్ని పొడిచేసి ఆ ఉడుకుతున్న మ్యాగీలో వేసింది.
ఆ తరువాత రెడీ అయిన చాక్లెట్ మ్యాగీ ని ఒక బౌల్ లోకి తీసుకుని దీని మీద ఒక స్కూప్ ఐస్ క్రీం పెట్టి అలంకరించింది. ఈ వీడియో చూసి ఇంటర్నెట్ షేక్ అయ్యింది.
ఇదేం కాంబినేషన్.. అసలు మ్యాగీ మజానే పోగొట్టింది అంటూ ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఇలాంటి విచిత్రమైన కాంబినేషన్ తయారుచేయడానికి ఆమె ఎందుకు ప్రయత్నించిందో తెలుసుకోవాలని కొంతమంది ఉత్సాహం చూపించారు.
ఈ కాంబినేషన్ అస్సలు అంగీకరింలేకుండా ఉన్నామంటో మరొక యూజర్ కామెంట్ చేశాడు. మొత్తానికి ఏదో రకంగా వైరల్ అయితే అయ్యింది. మీరేమంటారు.

Latest Videos

click me!