రోటీలు, చపాతీలు మెత్తగా, గుండ్రంగా ఉండే.. తినడానికి ఎంత బాగుంటుంది.. చూడటానికి కూడా అంతే బాగుంటుంది. కానీ.. మెత్తగా రోటీలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అయితే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. రోటీ చేయడం చాలా సులువు.
మామూలుగా వచ్చినవారికైతే రోటీలు, చపాతీలు చేయడం చాలా సులభం. కేవం రెండే రెండు పదార్థాలతో దీనిని తయారు చేస్తారు. ఒకటి గోధుమ పిండి.. మరోటి నీరు. ఈ రెండు సరిగ్గా కలపడం వస్తే రోటీ చేయడంచాలా సులువు.
ఈ పిండిలోనూ చాలా రకాలు ఉంటాయి. మామూలు గోధుమ పిండి ఉంటుంది.. మల్టీ గ్రెయిన్ పిండి.. గుల్టెన్ ఫ్రీ పిండి ఇలా రకాలు ఉంటాయి. ఏది కావాలో ఎంచుకుంటే సరిపోతుంది. ఈ పిండి కలుపుకునే సమయంలో కొద్దిగా ఉప్పు వేసుకోవడం మర్చిపోవద్దు. ఇక పిండి బాగా కలవాలి అంటే.. మూడు కప్పుల పిండికి.. ఒకటి లేదా 1.25 కప్పుల నీరు అవసరం అవుతుంది. ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుంటే.. మరింత మెత్తగా వస్తాయి.
ముందుగా పిండిని తీసుకొని.. దాంట్లో కొంచెం ఉప్పు, నూనె వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత నీరు కొద్దికొద్దిగా పోస్తూ.. పిండిని చక్కగా కలుపుకోవాలి. రోటీ చేసుకునే వీలు ఉండేలా పిండిని కలుపుకోవాలి. దోశ పిండిలా కలపకూడదు.
తర్వాత పిండిని చిన్నచిన్న లడ్డూల్లాగా గుండ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చిన్న ఉండును తీసుకొని ముందుగా.. చేతితో గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత.. చపాతీ కర్రతో.. 45 డిగ్రీలో రోటీ చేయడం మొదలుపెట్టాలి. అలా అటు ఇటూ.. కొద్దిగా పొడి పిండి వేస్తూ.. రోలర్ తో చేయాలి. ఇలా చేస్తే.. రోటీ గుండ్రంగా వస్తుంది.
ఇక చేసిన రోటీని.. కాల్చడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పాలి. ముందు తవ వేడి చేయాలి. తవ వేడి అయ్యే వరకు దానిపై చపాతీ ఉంచకూడదు. వేడి కాకుండా దాని మీద వేస్తే.. అది గట్టిగా వస్తుంది. అలా కాకుండా.. తవ బాగా వేడి అయిన తర్వాత దాని మీద చపాతీ , రోటీ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
అలా కాల్చేటప్పుడు.. ఒక క్లాత్ తీసుకొని.. దానిపై ఒత్తుతూ.. రెండు వైపులా కాల్చాలి. ఇలా చేస్తే.. రోటీ కానీ.. చపాతీ కానీ.. పూరీ పొంగినట్లు పొంగుతాయి. కావాలంటే నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు.
ఇలా కాల్చుకుంటే.. రోటీలు మెత్తగా.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా వస్తాయి. ఇప్పుడు దానికి తగిన కూరతో హాయిగా ఆరగించవచ్చు.