పెరుగులో తేనె కలుపుకుని తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 4, 2024, 3:08 PM IST

కొంతమంది పెరుగును తియ్యగా కూడా తింటుంటారు.అంటే చక్కెర కలుపుకుని. కానీ చక్కెరకు బదులుగా పెరుగులో తేనె కలుపుకుని తింటే మీరు ఎన్ని లాభాలను పొందుతారో తెలుసా? 

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన  బాడీలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేస్తుంది.అందుకే మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. 

మనం రోజూ తినే హెల్తీ ఫుడ్ లో పెరుగు ఒకటి. ముఖ్యంగా లంచ్ లో చాలా మంది పెరుగును బాగా తింటారు. నిజానికి పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. 

పెరుగులో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమై కాల్షియం, పొటాషియం, విటమిన్ బి2, విటమిన్ బి12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. పెరుగు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే దీన్ని తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. 

పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

 పెరుగును తింటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ముఖ్యంగా..

- ఎముకల అరుగుదల, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. వీల్లు రోజూ పెరుగును తింటే ఈ సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. పెరుగులో ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

- పెరుగు గట్ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో  ప్రోబయోటిక్స్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

- పెరుగును ఉపయోగించి జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం పెరుగును నేరుగా తలకు అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోతుది. అలాగే జుట్టు డ్రైనెస్ తగ్గిపోతుంది. నెత్తిమీది ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.

- పెరుగును రెగ్యులర్ గా తినడం వల్ల మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. దీన్ని తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

- పెరుగును తింటే గట్ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. దీంతో మీకు కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. 

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పెరుగులో ఒక టీస్పూన్ తేనెను కలుపుకుని తింటే మీరు ఇంతకు మించి ప్రయోజనాలను పొందుతారు. 


పెరుగు, తేనె ప్రయోజనాలు:

పెరుగు మాదిరిగానే తేనె కూడా మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.తేనె  అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన దివ్య ఔషధం. తేనెలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లు మెండుగా ఉంటాయి. అసలు పెరుగులో తేనును కలుపుకుని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

1. పెరుగులో ప్రోటీన్లకు కొదవే ఉండదు. అలాగే తేనెలో గ్లూకోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ మిక్స్ చేసి తింటే ఒంట్లో ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది. 

2. తేనె, పెరుగు రెండింటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తింటే కడుపు, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

3. తేనె, పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలు రానేరావు. 

4. తేనె, పెరుగు రెండింటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ  కలిపి తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

5. పెరుగును తేనెను ప్రతిరోజూ తింటే మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

ముఖ్య గమనిక :

తేనెలో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా తినాలి. లేదంటే మీకు డయాబెటిస్, ఓవర్ వెయిట్ సమస్యలు వచ్చి  గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, కొంతమంది తేనెను కొంచెమే తినాలి. ఎందుకంటే ఇది అలెర్జీకి కారణమవుతుంది. 

Latest Videos

click me!