సొరకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. దీని రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలో నీటి లోపం ఉండదు. సొరకాయ రసం ఖాళీ కడుపుతో 1 నెల పాటు తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఐరన్ , పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇన్ని ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు... చర్మం యవ్వనంగా కనిపించడంలోనూ , చర్మం మెరిసేలా చేయడంలోనూ సహాయపడుతుంది.