మీరు మసాలా ప్రేమికులా? అయితే, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రపంచంలోని అత్యంత కారంగా ఉండే 8 మిరపకాయలు ఏంటో మీకు తెలుసా? వీటిని కూరలు, సాస్‌లు, పచ్చళ్ల తయారీలో వాడతారు.
ఈ మిరపకాయల కారాన్ని స్కోవిల్లే స్కేల్ తో కొలుస్తారు. దీన్ని 100 సంవత్సరాల క్రితం విల్బర్ స్కోవిల్లే కనిపెట్టాడు. ఈ మిరపకాయల్లో క్యాప్సైసినాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నోటికి తగలగానే నాలుక కిందున్న నరం చివరల్లో మంట లేదా కారం అనుభూతిని కలిగించి.. దాన్ని మెదడుకు తెలియజేస్తాయి.
ఆ ఎనిమిది రకాల మిరపకాయలు ఏంటో చూడండి...
కరోలినా రీపర్ప్రపంచంలోనే అత్యంత కారం కలిగిన మిరపకాయలు. ఇది మొదట దక్షిణ కరోలినా రాష్ట్రంలో కనుగొన్నారని అధ్యనాలు తెలుపుతున్నాయి. అందుకే దీనిపేరు కరోలినా రీపర్ అని వచ్చింది. తేలు కొండిలాంటి ప్రత్యేకమైన రూపంతో ఉంటుంది.
మోరుగా స్కార్పియన్ఇది ట్రినిడాడ్‌లో దొరికే సెకండ్ హాటెస్ట్ పెప్పర్ రకం ఇది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పండురుచిని కలిగి ఉండే ఈ మిరపకాయ తింటే కారం నశాలానికి అంటాల్సిందే.
నాగా మోరిచ్దీన్నే 'ది స్నేక్' అని కూడా పిలుస్తారు. ఈ మిరపకాయ రకం బంగ్లాదేశ్ నుండి వచ్చింది. భుట్ జోలోకియా లాంటి ముడతలుగల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ మిరపకాయలు సైజ్ లో చాలా చిన్నగా ఉంటాయి. పై తోలు మీద పక్కటెముకలలాంటి నిర్మాణం కనిపిస్తుంది.
చాక్లెట్ ట్రినిడాడ్ స్కార్పియన్ఇది ప్రపంచంలోనే అత్యంత కారం ఉండే మిరపకాయ. అంతేకాదు స్కోవిల్లే స్కేల్‌లో 1.2 మిలియన్లతో ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయగా గుర్తించబడింది. ఈ మిరపకాయల్ని BBQ మరియు సాస్‌లలో ఉపయోగిస్తారు.
భుట్ జోలోకియాదీన్ని హోలీ పెప్పర్ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశానికి చెందింది. భుట్ జోలోకియా 4 - 7 సెం.మీ పొడవుతో ముడతలుగల చర్మం కలిగి ఉంటుంది. డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ ప్రకారం, భుట్ జోలోకియాలోని కారం 855,000 SHU.
హబనేరో రెడ్ సవినా పెప్పర్ఇది క్యాప్సికమ్ చైనీస్ క్యాప్సికమ్ ఫ్యామిలీకి చెందింది. ఈ మిరపకాయ 1994 నుండి 2007 వరకు ప్రపంచంలోని హాటెస్ట్ పెప్పర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. దీని స్పైసీనెస్ 350,000 నుండి 850,000 SHU వరకు ఉంటుంది.
089 స్కాచ్ బోన్నర్ పెప్పర్కరేబియన్ దీవులలో ఈ మిరపకాయలను ఎక్కువగా పండిస్తారు. గయానాలో కూడా ఇది కనిపిస్తుంది. అక్కడ దీన్ని "బాల్ ఆఫ్ ఫైర్" అని పిలుస్తారు.
మంజానో పెప్పర్పెరూ, బొలీవియాల్లో పండించే ఈ రకం మిరపకాయకు విలక్షణమైన ఎరుపు రంగు ఉంటుంది. అయితే మిగతా మిరపకాయలతో పోల్చుకుంటే దీంట్లో కండ ఎక్కువగా ఉంటుంది.