జూన్ నెల మొదలైనా.. ఇంకా ఎండలు తగ్గలేదు. దీంతో.. చాలా మంది ఆ వేడి తగ్గడానికి రోజూ పెరుగు తింటారు. లేదా లస్సీ , మజ్జిగ లాంటివి తాగుతుంటారు. ఈ రోజుల్లో అలా రోజు పెరుగు తినడం మంచిదే. పెరుగు మన జీర్ణక్రియకు మంచి చేస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్ భాగాలు ఉంటాయి.
అయితే.. ఇదే పెరుగుతో కొన్ని రకాల ఆహారాలను కలిపితీసుకున్నా.. లేదా పెరుగు తర్వాత వీటిని తిన్నా.. ప్రయోజనం కన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పెరుగు లో విటమిన్, విటమిన్ బి -2, విటమిన్ బి -12, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ, కొన్ని ఆహారాలతో పెరుగు కలిపి తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
పెరుగుతోపాటు ఆయిల్ ఫుడ్స్ తీసుకోకూడదు. అంటే.. నెయ్యితో చేసినవి, పరోటా, పకోడీలు, ఫ్రెంచ్ ప్రైస్ లాంటివి తినకూడదు. ఇవి తినడం వల్ల మళ్లీ జీర్ణక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో బద్దకం కూడా పెరుగుతుంది.
ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు తర్వాత చేపలు తినకూడదు. ఎందుకంటే.. చేపల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పెరుగులో కూడా ప్రోటీన్లు ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఏ రెండు ఆహారాలను ఒకేసారి తీసుకోకూడదు.. దీని వల్ల చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు.. పెరుగు, పాలు ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, హార్ట్ బర్న్, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి. పెరుగు.. పాలు నుంచి తయారు చేసినప్పటికీ.. రెండింటిలో హై ప్రోటీన్స్ ఉన్నప్టపికీ.. ఈ రెండు ఒకే సమయంలో తీసుకోకూడదు.
మామిడి పండ్లను తినడం ఇష్టం లేనివారంటూ ఎవరూ ఉండరు. చాలా మంది పెరుగన్నంలో మామిడిపండు కలుపుకొని తింటారు. అయితే.. దీనివల్ల కొత్త రకం సమస్యలు వస్తాయట. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ఫుడ్ రియాక్షన్లు, చర్మ వ్యాధులు రావడం లాంటవి జరుగుతాయి.