ది బెస్ట్ అల్లం టీ ఎలా చేయాలో తెలుసా..?

First Published | Jun 4, 2021, 2:41 PM IST

అయితే.. అల్లం టీ పెట్టడం అందరికీ సులభం కాదట. దానిని అదిరిపోయేలా చేయాలంటే.. ఇదిగో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..
 

చాలా మందికి నిద్రలేవగానే.. గొంతులోకి వేడి వేడి గా టీ తాగనిది రోజు మొదలుకాదు. సాధారణ టీల కంటే.. అల్లం టీ కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఎండాకాలం పోయి.. వాతావరణం చల్లగా మారింది. అప్పుడప్పుడు వర్షాలు పడుతుండటంతో.. వర్షాకాలం మొదలైందని అర్థమౌతూనే ఉంది. వాతావారణం ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా టీ తాగితే ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందో. అందులోనూ అల్లం టీ అంటే మరింత హాయిగానూ ఉంటుంది.. ఆరోగ్యంగానూ ఉంటుంది.

అయితే.. అల్లం టీ పెట్టడం అందరికీ సులభం కాదట. దానిని అదిరిపోయేలా చేయాలంటే.. ఇదిగో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..
ముందుగా అల్లాన్ని బాగా శుభ్రం చేసుకొని.. దాని పొట్టు తొలగించాలి. తర్వాత దానిని తురమడం కానీ..పచ్చడి పచ్చడిగా దంచుకోవడం చేసుకోవాలి.
ఇప్పుడు కొన్ని యాలకులను కూడా దంచి సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీకు యాలకుల వాసన నచ్చకపోతే.. దీనిని వదిలేయవచ్చు.
తర్వాత రెండు కప్పుల వాటర్ తీసుకొని.. టీ గిన్నెలో పోసి బాగా మరగనివ్వాలి. అందులో ఇప్పుడు దంచిన అల్లం, యాలకుల పొడి వేయాలి.
దీనిని బాగా మరగనివ్వాలి. అల్లం రసం నీటిలోకలిసి.. లైట్ ఎల్లో కలర్ లోకి మారే వరకు మరగనివ్వాలి. అప్పుడు అల్లం రసం పూర్తిగా బయటకు వస్తుంది.
రెండు కప్పుల టీకి మీ రుచికి తగినంత పంచదార యాడ్ చేయాలి. దీనిని కూడా కాసేపు మరగనివ్వాలి. టీ నీరు బ్రౌన్ కలర్ లోకి మారుతుంది.
ఇప్పుడు రెండు లేదా మూడు టీ స్పూన్ల టీ పొడి వేయాలి. దీనిని బాగా మరగనివ్వాలి. టీపొడి మరిగి.. వాసన వచ్చేంత వరకు మరగనివ్వాలి.
ఇప్పుడు అందులోకి ఒక కప్పు పాలు పోయాలి. మీ రుచికి తగినట్లు పాల తక్కువ, ఎక్కువ చేసుకోవచ్చు. కొందరికి పాలు తక్కువగా ఉంటే నచ్చుతుంది.. కొందరి ఎక్కువగా ఉంటే నచ్చుతుంది. కాబట్టి.. వారి రుచి కి తగినట్లు మార్చుకోవచ్చు
స్టవ్ సిమ్ లో పెట్టి మరగనివ్వాలి. అంతే... గుమ గుమలాడే అల్లం టీ రెడీ అయిపోయినట్లే..!
ఇప్పుడు ఈ వేడి వేడి అల్లం టీని సాయంత్రం పూట చల్లగా ఉన్న సమయంలో.. స్నాక్స్ తింటూ తాగుతుంటే చాలా హాయిగా ఉంటుంది.

Latest Videos

click me!