World Food Day 2021: చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఫుడ్స్ ఇవి..!

First Published | Oct 16, 2021, 12:32 PM IST

ప్రపంచ వ్యాప్తంగా రుచికరమైన ఆహారాలు తినడానికి మనమందరం ఇష్టపడుతున్నాం. కాగా.. ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ సందర్భంగా.. చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఆహారాలేంటో ఓసారి చూద్దాం..

ఈ ప్రపంచంలో ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఏ ఒక్క జీవి కూడా బతకలేదు. ఈ విషయం మనందరికీ తెలిసిన సత్యం. అయితే.. కేవలం  బతకడానికి మాత్రమే ఆహారాలు తీసుకునే రోజులు మారాయి.. ప్రపంచ వ్యాప్తంగా రుచికరమైన ఆహారాలు తినడానికి మనమందరం ఇష్టపడుతున్నాం. కాగా.. ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ సందర్భంగా.. చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఆహారాలేంటో ఓసారి చూద్దాం..
 

ఆరెంజ్..
ఆరెంజ్‌లో విటమిన్ సి ఉంటుంది, కాబట్టి ముఖం మీద వినియోగించినా లేదా అప్లై చేసినా,  ఆరెంజెస్ తిన్నా కూడా.. అది మీ చర్మంపై అద్భుతాలు చేస్తుంది. ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించినట్లయితే,  ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది మరియు మిమ్మల్ని తాజాగా  మెరిసేలా చేస్తుంది.
 

Latest Videos


స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలలో ఆల్ఫా-హైడ్రాక్సిల్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది . ఇది చనిపోయిన డెడ్ సెల్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. ఇది చక్కటి గీతలు మరియు ముడుతలను తగ్గిస్తుంది. మీరు స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ తయారు చేసి, కొన్నింటిని మెత్తగా చేసి, తేనెను కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.

గుమ్మడికాయ
గుమ్మడికాయలో విటమిన్ ఎ నుంచి విటమిన్ సి వరకు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుమ్మడికాయ లో ఉండే ఈ విటమిన్స్ చర్మం మెరవడానికి కూడా సహాయపడుతుంది.  దీనిలో  జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త చర్మాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది.  స్కిన్ టోన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బీట్ రూట్..

ఇది బ్యూటిఫుల్ స్కిన్ సేవర్ గా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగండి, అది మీ చర్మానికి అద్భుతాలను చేస్తుంది. ఇది లోపల నుండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, టాక్సిన్‌లను శుభ్రపరుస్తుంది, మీ ముఖం మీద మెరుపుని తీసుకువస్తోంది.
 

tomato

టమోటా

టమోటాలలో విటమిన్ A, K, B1, B3, B5, B6, B7 విటమిన్ C పుష్కలంగా ఉంటాయి.. టమోటాలలో అద్భుతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. మీరు టమోటా రసాన్ని ముఖానికి, మెడకు కూడా అప్లై చేయవచ్చు, ఇలా తరచూ చేయడం వల్ల ముఖం తాజాగా, నవ యవ్వనంగా మెరిసిపోతుంది.

click me!