పిజ్జా తినండి.. కామెంట్ చేయండి.. రూ.5లక్షలు గెలవండి..!

First Published | Oct 5, 2021, 2:31 PM IST

ఆ ఆఫర్ ఏంటంటే.. ఈ కొత్త రకం పిజ్జాను రుచి చూసి.. అది ఎలా ఉందో చెబితే సరిపోతుంది. మీరు చేసిన కామెంట్, రివ్యూ కనుక వారికి నచ్చితే.. వెంటనే మీకు రూ.5లక్షల నగదు బహుమతి ఇస్తారు.
 

pizza

పిజ్జా.. ఈ జనరేషన్ వారికి ఇది ఫేవరేట్ ఫుడ్. భూమి మీద ఉన్నవారు మాత్రమే కాదు.. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడా పిజ్జాను ఇష్టంగా తినడం గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్  అయ్యింది. కాగా.. పిజ్జా ప్రేమికుల కోసం ఓ రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే.. మన దగ్గర కాదులేండి యూకేలో..మరి ఆ ఆఫరేంటో ఓసారి చూసేద్దామా..

యూకేలోని   అమెరికన్ బహుళజాతి రెస్టారెంట్.. చైన్ పిజ్జా హట్... పిజ్జా ప్రియుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పిజ్జ హట్ వారి నుంచి కొత్త స్టఫ్డ్ క్రస్ట్ పిజ్జాను పరిచయం  చేసింది.
 


pizza

ఆ ఆఫర్ ఏంటంటే.. ఈ కొత్త రకం పిజ్జాను రుచి చూసి.. అది ఎలా ఉందో చెబితే సరిపోతుంది. మీరు చేసిన కామెంట్, రివ్యూ కనుక వారికి నచ్చితే.. వెంటనే మీకు రూ.5లక్షల నగదు బహుమతి ఇస్తారు.

pizza

యూకేలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఈ పిజ్జా హట్ ఆఫర్ వర్తిస్తుంది. మీరు చేయాల్సిందల్లా.. అక్కడకు వెళ్లి ఆ పిజ్జా తినడమే. వారు కొత్తగా తయారు చేసిన ఈ పిజ్జా మీకు ఎంత నచ్చిందో చెప్పాలి. అంతేకాకుండా.. దాని ఫీచర్లు కూడా వివరించాల్సి ఉంటుంది.

pizza

కొత్త పిజ్జాలు చీజ్ స్టఫ్డ్ చీజ్ వెల్లుల్లి పిజ్జా మరియు పెప్పరోని పిజ్జా. చీఫ్ క్రస్ట్ టెస్టర్ కోసం దరఖాస్తుదారులు ఈ రెండు పిజ్జాలు తిని వ్యాఖ్యానించాలి.

pizza

రెండు పిజ్జాలు తిన్న తర్వాత, వాటి టాపింగ్స్ మరియు ఫ్లేవర్ లక్షణాలను విశ్లేషించి.. దానికి మీ రేటింగ్ ఇవ్వాలి. దానిని ఇంకా టేస్టీగా చేయాలంటే ఎలా మెరుగుపరుచుకోవాలో కూడా వారికి చెప్పాలి. అంతే.. మీరు ఇచ్చిన రివ్యూ నిజంగా వారిని సంతృప్తి పరిస్తే.. మీ జేబులోకి రూ.5లక్షలు వచ్చి చేరినట్లే.. 

Latest Videos

click me!