సులభంగా బరువు తగ్గాలా..? అర్థరాత్రి ఈ ఫుడ్స్ తినండి..!

First Published | Oct 8, 2021, 3:18 PM IST

ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. రోజువారీ కార్యకలాపాలతో పాటు, రాత్రి సమయ దినచర్యలు కూడా ముఖ్యమైనవి. 

చాలా మందికి రాత్రిపూట భోజనం చేయాల్సిన సమయంలో ఆకలిగా అనిపించదు. దీంతో అసలు తినకుండా ఉండిపోతారు. లేదంటే.. ఏదో తిన్నామంటే తిన్నామని కొద్దిగా తింటారు. అప్పుడు బాగానే ఉంటది. కానీ నిద్రపోయాక అర్థరాత్రి సమయంలో ఆకలి మొదలౌతుంది. ఆ అర్థరాత్రి ఆకలిని భరించలేం. దీంతో.. ఏదో ఒకటని కచ్చితంగా తినేస్తుంటారు. వాటిలో ఎక్కువగా ఆరోగ్యానికి హాని చేసేవే ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మళ్లీ బరువు సమస్య వేధించడం మొదలుపెడుతుంది.

pregnancy


మరి అలా కాకుండా ఉండాలి అంటే.. అర్థరాత్రి తిన్నా కూడా.. మన ఆరోగ్యానికి ఎలాంటి చేటు చేయకుండా.. బరువు పెరగకుండా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలేంటో ఓసారి  చూసేద్దామా..

Latest Videos


healthy eating

ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. రోజువారీ కార్యకలాపాలతో పాటు, రాత్రి సమయ దినచర్యలు కూడా ముఖ్యమైనవి.  నిద్రవేళకు 2 గంటల ముందు భోజనం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తారు. కానీ ప్రతిసారీ ఈ నియమాన్ని పాటించడం కష్టం.

mobile


కొన్నిసార్లు మనకు అర్థరాత్రి ఆకలి వేస్తుంది. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో ఏమున్నాయని వెతుక్కొని వాటిని తినేస్తూ ఉంటాం.  కొన్నిసార్లు కేకులు, బిస్కెట్లు, చిప్స్ వంటి వాటిని తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

looking mobile while eating

ఈ సందర్భంలో, మన ఇంట్లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఉంచుకొని వాటిని మాత్రమే తింటే.., మనం బరువు పెరిగే సమస్యను నివారించవచ్చు. కాబట్టి మన ఆరోగ్యానికి హాని కలిగించని ఆకలిని తీర్చడానికి మనం అర్థరాత్రి ఏమి తినవచ్చో చూద్దాం. 

మఖానా ఆరోగ్యానికి చాలా బాగుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి, అందుకే రాత్రిపూట తినడం ఆరోగ్యానికి హాని కలిగించదు. దీనిని నూనెలో వేయించుకోవచ్చు లేదా అలాగే వేయించుకోవచ్చు. దీని తీసుకోవడం వల్ల బరువు పెరగరు.

చాలా మందికి చిప్స్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటివారు.. ఆలు చిప్స్ కి బదులు రాగి చిప్స్ తినడం మేలు. వీటిని అర్థరాత్రి తిన్నా ఎలాంటి హానీ ఉండదు. ఆరోగ్యానికి మేలు కూడా చేస్తాయి.

లేదంటే.. రాత్రి సమయంలో హెర్బల్ టీ తాగడం మంచిది. దానిలో తేనె, దాల్చిన  చెక్క, అల్లం, తులసి వంటివి వేసి కాచుకొని తాగడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రకూడా పడుతుంది.

fruits

అలాకాదు.. కడుపు బాగా నిండాలి అంటే.. అర్థరాత్రి సమయంలో పండ్లు తినడం మంచిది. అరటి పండు, పుచ్చకాయ, కర్భూజ లాంటివి తినొచ్చు. 

click me!