మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో పండ్లు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే.. ఒక్కో పండు ఒక్కో గుణం , ఒక్కో స్వభావం కలిగి ఉంటుంది. ఆ పండ్లను మనం తినడం వల్ల.. వాటి వల్ల మనకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కింది ఫుడ్స్ అయితే ఏకంగా.. మన శరీరంలో రక్తం శుద్ధి అవుతుందట. మరి, ఎలాంటి పండ్లు తింటే... మన రక్తం మంచిగా ప్యూరిఫై అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
ద్రాక్ష..
ద్రాక్ష లో రిజ్వెరటాల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎరుపు, పర్పుల్ కలర్ ద్రాక్షలో మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వీటిని తినడం వల్ల.. మన శరీరంలో ని రక్తం దానంతట అదే శుద్ధి అవుతుంది.
పుచ్చకాయ...
పుచ్చకాయను మనం దాదాపు ఎండాకాలం ఇష్టంగా తింటూ ఉంటాం. ఎందుకంటే... ఈ కాలంలో మన బాడీ డీ హైడ్రేడెటెడ్ గా మారుతుంది. అదే.. పుచ్చకాయ తింటే... శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇక్కడి వరకే మనకు తెలుసు. కానీ... వాటర్ మిలన్ తినడం వల్ల... మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
3.కివి..
కివి పండులో విటమిన్ కె, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు... డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇవన్నీ.. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో , రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.
avacado
4.అవకాడో..
అవకాడో కూడా మన రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకంగా పని చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అవకాడోలో మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి.