టీ ని మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగుతున్నారా..? ఏమౌతుందో తెలుసా?

First Published | May 29, 2024, 7:31 PM IST


టీ పెట్టినప్పుడు తాగితే పర్లేదు. కానీ దానిని పదే పదే వేడి చేసి తాగితే.... చాలా రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది.  ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..


మన ఇండియన్స్ కి చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. దాదాపు మనలో అందరూ మిల్క్ టీనే ఇష్టపడతారు.  ఆ టీ తాగకపోతే.. వారికి విపరీతంగా తలనొప్పి వస్తుంది. చాలా స్ట్రెస్  కి గురౌతూ ఉంటారు. టీ తాగినవెంటనే వారికి చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. కానీ... కొందరు..ఒక్కసారి పెట్టిన టీని.. మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగుతూ ఉంటారు.

టీ పెట్టినప్పుడు తాగితే పర్లేదు. కానీ దానిని పదే పదే వేడి చేసి తాగితే.... చాలా రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది.  ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..


పోషకాలను కోల్పోవడం: మిల్క్ టీని ఎక్కువ సేపు ఉడకబెట్టడం వల్ల దానిలోని పోషకాలను కోల్పోతుంది. ఎందుకంటే పాలలో కాల్షియం, ప్రొటీన్ ,విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పాలను ఎక్కువసేపు  మరికించడం వల్ల  వల్ల వీటిని కోల్పోతారు.
 


రుచిలో మార్పులు: మిల్క్ టీని ఎక్కువ సేపు ఉడకబెట్టడం వల్ల దాని రుచి పోతుంది. ఉదాహరణకు, చేదు లేదా అసహ్యకరమైన రుచిని ఇవ్వడం. మరో మాటలో చెప్పాలంటే, ఇది టీ నిజమైన రుచి పోతుంది.
 

milk tea

టీని తరచూ మరిగించడం వల్ల ప్రొటీన్‌ను డీనేచర్ చేసి గడ్డకట్టేలా చేస్తుంది. ఇది టీ రూపాన్ని కూడా  మార్చేస్తుంది. 


యాంటీఆక్సిడెంట్ లక్షణాలు తగ్గుతాయి: మిల్క్ టీని ఎక్కువగా మరిగించడం వల్ల పాలలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు నశిస్తాయి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పోతాయి. ఇంకా ఏమిటంటే, మిల్క్ టీని ఎక్కువగా  మరిగించడం ద్వారా, మీరు మొత్తం ఆరోగ్యానికి దోహదపడే కొన్ని ముఖ్యమైన సమ్మేళనాలను కోల్పోతారు.

జీర్ణ సమస్యలు:  ఎక్కువగా మరిగించిన టీని  ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి, ఎందుకంటే అది ఉడకబెట్టినప్పుడు, అది దాని ప్రోటీన్ నిర్మాణాన్ని మారుస్తుంది. ఇది తాగిన తర్వాత జీర్ణం కావడం కష్టమవుతుంది. ఇది గ్యాస్ ఉబ్బరం , కడుపులో అసౌకర్యం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.

Latest Videos

click me!