Winter: ఈ ఆహారాలు కచ్చితంగా తీసుకోవాల్సిందే..!

First Published Nov 10, 2021, 4:57 PM IST

శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత, అలసట, చిరాకు, చేతులు బిగుసుకుపోవడం, నోటిపూత, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

చలికాలం వచ్చింది అంటే చాలు.. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని వల్ల .. మన శరీరంలో ఆరోగ్య సమస్యలు రావడం మొదలౌతాయి. కండరాల నొప్పులు, కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం.. చర్మ సమస్యలు రావడం మొదలౌతాయి. దీనికి ప్రధాన కారణం.. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం  వల్లే.. ఈ రకం సమస్యలు మొదలౌతూనే ఉన్నాయి. కాబట్టి.. ఈ చలికాలంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవాలంటే.. మన డైట్ లో కచ్చితంగా  కొన్ని రకాల ఆహారాలను చేర్చాలి. 

విటమిన్ బీ12 అధికంగా ఉండే ఆహారాలను డైట్ లో తీసుకోవాలి.  విటమిన్ బి12 ఎముకలకు చాలా మంచి చేస్తుంది. శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత, అలసట, చిరాకు, చేతులు బిగుసుకుపోవడం, నోటిపూత, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ బి12 అధికంగా ఉండే రెడ్ మీట్ , చేపలు ,షెల్ పిష్ , చిక్కుళ్ళు, బీన్స్, చీజ్, మజ్జిగ మొదలైన వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది .. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 
 

డ్రై ఫ్రూట్స్ 
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినాలని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతారు. అదే సమయంలో, వారు దాని ప్రయోజనాలను వివరిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి.

dry fruits

మీరు మీ ఆహారంలో బాదం, వాల్‌నట్, పిస్తా మరియు వేరుశెనగలను కూడా చేర్చుకోవాలి. ఇది శరీరం ఫ్లూ నుండి దూరంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ , నట్స్ ప్రతిరోజూ 30 గ్రాములు తీసుకోవాలి.  మీ పిడికిలికి సరిపోయేటంత తీసుకొని.. ప్రతిరోజూ తినాలి. ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు.

విటమిన్ సి ఉన్న పండ్లు

మన శరీరం అవసరమైన మేరకు విటమిన్ 'సి'ని ఉత్పత్తి చేసుకోదు. కాబట్టి మనం విటమిన్ సి కోసం వివిధ రకాల ఆహారాలను తినాలి. ఒక వ్యక్తికి రోజుకు 65 నుండి 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం. సీజనల్ పండ్లను తినడం ద్వారా దీనిని పొందవచ్చు.
 

ఈ సీజన్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు: నారింజ, ఉసిరి, సీజనల్ ద్రాక్ష. ఇవి మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల మీ చర్మ కాంతి పెరుగుతుంది. విటమిన్ సి కంటెంట్ జీబ్రా, దూడ మాంసం, నారింజ పండు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, కివీ, కాలే, లీచీ, పార్స్లీ మొదలైన వాటిలో కూడా కనిపిస్తుంది.


చలికాలంలో మీరు మార్కెట్‌లో ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలను చూస్తారు. ఉదా: పాలక్ సొప్పు, మెంతికూర, సార్సో,  మొదలైనవి. ఈ కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి మనలను రక్షించడానికి తగినంత ఇనుము, ప్రోటీన్ మరియు ఫైబర్ పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి వాటిని తప్పకుండా తినండి.
 

vitamin A

విటమిన్ ఎ , ఇ తీసుకోవడం 

వేసవిలో తక్కువ చలికాలంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కూరగాయలలో క్యారెట్ ఒకటి. అయితే.. క్యారెట్ హల్యా చేసుకొని తినడం కాదు.. సలాడ్ లాగా తినాలి.  ఎందుకంటే ఇది మీకు కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ మరియు ఇలను ఇస్తుంది.

ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది మీ శరీరం బలాన్ని పొందుతుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి , కండరాలకు అద్భుతమైన పోషణను అందిస్తుంది. విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపడటానికి సహాయం చేస్తుంది.

click me!