ఈ రోజుల్లో హై బీపీతో బాధపడుతున్నవారు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు 50 దాటిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ.. ఇప్పుడు.. నువ్వు, నేను అనే తేడా లేకుండా.. యువకులు, మధ్య వయస్కులు కూడా ఈ రకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ హై బీపీని సైలెంట్ కిల్లర్ అని చొప్పొచ్చు. ఎలాంటి లక్షణాలు చూపించకుండానే.. సడెన్ గా మనిషిని చంపేయగలదు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని నిపుణులు పేర్కొంటున్నారు.
ఒక్కసారి ఈ హైబీపీ వచ్చిన తర్వాత.. దానిని పూర్తిగా తగ్గించుకోలేకపోయినా.. కంట్రోల్ చేసుకోలిగే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హై బీపీ ఉన్నవారు ప్రతిరోజూ బీపీని చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండటంతోపాటు.. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హై బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
పచ్చడి.. దాదాపు అందరి ఇళ్లల్లో నిల్వ పచ్చళ్లు ఉంటాయి. అయితే.. అవి సంవత్సరం పాటు నిల్వ ఉండాలని వాటిల్లో ఉప్పు కాస్త ఎక్కువగా నే వేస్తారు. కాబట్టి.. ఆ నిల్వ పచ్చళ్లను హై బీపీ ఉన్నవారు అస్సలు తినకూడదు. దాని వల్ల బీపీ మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చీజ్.. చీజ్ లోనూ సోడియం విలువలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చీజ్ స్లైస్ లో 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి.. చీజ్ ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బేకన్.. హై బీపీని కంట్రోల్ లో ఉంచవాలి అనుకునేవారు బేకన్ కి దూరంగా ఉండాలి. దీనిలో కొవ్వు, కొలిస్ట్రాల్, సాల్ట్.. కంటెంట్ లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
పంచదార ఎక్కువగా ఉండే డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లు బరువు పెరగడానికి కారణమౌతాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. ఈ కూల్ డ్రింక్స్, తాగేవారిలో కూడా హై బీపీ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెస్టారెంట్ లో లభించే ఫ్రెంచ్ ప్రైస్ లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల కూడా రక్తంలో ఫ్రెజర్ ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి.. హై బీపీ ఉన్నవారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మీకు నమ్మసక్యంగా లేని మరో విషయం ఏమిటంటే... మినరల్ వాటర్ కి కూడా హై బీపీ ఉన్నవారు దూరంగా ఉండాలట. ఒక బాటిల్ మినరల్ వాటర్ లో 200 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుందట. కాబట్టి.. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.