చికెన్ ను ఇష్టపడనివారంటూ ఉండరు. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ 65 అంటూ ఎన్నో రకాలుగా చికెన్ ను తినొచ్చు. నిజానికి చికెన్ ను ఏ విధంగా తిన్నా అదిరిపోతుంది. అంతేకాదు చికెన్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. చికెన్ లో ప్రోటీన్, సెలీనియం, ఫాస్పరస్, నియాసిన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్ లో ప్రోటీన్లను తయారు చేయడానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు హార్మోన్లు, రోగనిరోధక కణాల ఉత్పత్తిలో సహాయపడతాయి. అలాగే ఇవి కండరాల పెరుగుదలను కూడా మెరుగుపరుస్తాయి.