రోజూ నెయ్యిని తింటే ఈ ప్రయోజనాలు మీ సొంతం..!

First Published | Sep 24, 2023, 2:51 PM IST

నెయ్యి ని తీసుకుంటే శరీర బరువు పెరుగుతుందని, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయని చాలా మంది నమ్ముతుంటారు. దీనివల్ల చాలా మంది నెయ్యికి దూరంగా ఉంటారు. నిజమేంటంటే.. 
 

నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఏండ్ల తరబడి చేసిన పరిశోధనల ప్రకారం.. నెయ్యి మన శరీరానికి హాని కలిగించే బదులు ఎంతో మంచి చేస్తుంది. పురాణాల్లో నెయ్యిని బంగారంతో సమానంగా భావిస్తారు. మన తాతలు, ముత్తాతలకు నెయ్యి విలువ తెలుసు. అప్పట్లో నెయ్యి ప్రతి రోజూ తినేవారు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాల ముప్పును తప్పిస్తుంది. నెయ్యిలో కొవ్వు తక్కువగా ఉంటుందని కూడా పలు పరిశోధనలో తేలింది. నిజానికి నెయ్యి మనకు హెల్తీ ఫ్యాట్స్,  మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. 

నెయ్యి ఇతర రకాల కొవ్వుల లాగ గుండె జబ్బులకు కలిగించదు. నెయ్యిని తీసుకోవడం వల్ల మన గట్ ఆరోగ్యంగా ఉంటుంది. మీకు తెలుసా? ఒకప్పుడు ప్రతి భోజనానికి ముందు ఒక చెంచా నెయ్యిని తీసుకునేవారు. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచి.. అల్సర్లు, క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది. నెయ్యి లేదా క్లారిఫైడ్ వెన్నను ఎన్నో ఏండ్లుగా భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నాయి. ప్రతిరోజూ మితంగా నెయ్యిని తినడం వల్ల ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


ghee

ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప మూలం

నెయ్యి ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వులతో తయారవుతుంది. ఇవి చాలా సులువుగా జీర్ణమవుతాయి. అలాగే మనకు మంచి శక్తిని అందిస్తాయి. హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ మాదిరిగా కాకుండా నెయ్యిలో ఉండే కొవ్వులు మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

జీర్ణక్రియకు మద్దతునిస్తుంది

నెయ్యిలో మనకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో బ్యూటిరిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది చిన్నగొలుసు కొవ్వు ఆమ్లం. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దీని పనితీరును మెరుగుపరుస్తుంది. 

విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి

నెయ్యి కొవ్వులో కరిగే విటమిన్ లైన విటమిన్ ఎ, విటమిన్ డి,  విటమిన్ ఇ, విటమిన్ కెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. అలాగే మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు శారీరక విధులకు ఈ విటమిన్లు చాలా చాలా అవసరం. 

ghee

పోషక శోషణను పెంచుతుంది

నెయ్యిలో  ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ కొవ్వులు కరిగే విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, మెగ్నీషియం వంటి కొన్ని పోషకాలను గ్రహించడానికి సహాయపడతాయి.
 

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, శోథ నిరోధక సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో మంటను తగ్గించడానికి ఎంతో సమాయపడుతాయి. అలాగే ఎన్నో రోగాల ముప్పును తప్పిస్తాయి. 

Latest Videos

click me!