నాటుకోడికి, ఫారం కోడికి చాలా తేడా ఉంటుంది… రుచి మాత్రమే కాదు వండే విధానాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సాధారణంగా పౌల్ట్రీ కోడి మాంసం మెత్తగా ఉంటుంది… కానీ నాటుకోడి మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకే ఇది ఉడకడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది.
అయితే ఈ కోళ్ల మాంసాన్ని శుభ్రం చేసే విధానంలోనూ తేడా కనిపిస్తుంది… పౌల్ట్రీ కోడిని కత్తిరించి నేరుగా ముక్కలు చేస్తారు… కానీ నాటుకోడిని కోయగానే ఈకలు పీకేసి స్కీన్ తొలగించకుండానే పసుపు రాస్తారు. ఇలా బాడీ మొత్తాన్ని పసుపుతో శుభ్రంచేశాకే మాంసం ముక్కలుగా కత్తిరిస్తారు… అయితే ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు. మరి నాటుకోడికి పసుపు రాయడం వెనకున్న అసలు కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం.
25
నాటుకోడి మాంసం పసుపుతోనే ఎందుకు శుభ్రం చేస్తారు?
ఇప్పటికీ పల్లెటూళ్లలో నాటుకోడిని శుభ్రం చేసేటప్పుడు లేదా మంటపై కాల్చే ముందు కచ్చితంగా పసుపు రాస్తారు. దీని వెనుక పాత కాలపు సంప్రదాయం దాగివుంది. అయితే ఇలా రాయడానికి ఒక కారణం కాదు, ఎన్నో కారణాలున్నాయి.
పల్లెల్లో నాటుకోళ్లు ఇళ్ల దగ్గర తిరుగుతూ పెరుగుతాయి. రాత్రి వీటిని గంపల కింద కమ్ముతారు.. తెల్లవారగానే బయటకు వదులుతారు. ఇవి ఇంటిపరిసరాల్లోని పెంటకుప్పలు, ఇతర అపరిశుభ్ర ప్రాంతాల్లో తిరుగుతూ అహారాన్ని సేకరించుకుంంటాయి… ఈ క్రమంలో వాటి శరీరంపై సూక్ష్మజీవులు చేరే అవకాశాలుంటాయి. అందుకే పూర్వం నాటుకోళ్లను కత్తిరించగానే పసుపు రాసేవారు.. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి… అందుకే దీంతో నాటుకోడి మాంసం శుభ్రం చేస్తారు.
35
పసుపులో ఉన్న లక్షణాలివే..
కోడి మీద ఉండే హానికరమైన క్రిములను నాశనం చేయడానికే కాదు దాని చర్మానికి ఉండే సహజమైన నీచు వాసనను తగ్గించడానికి కూడా పసుపు సహాయపడుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి… దీనితో కడగడం వల్ల మాంసం మరింత ఆరోగ్యవంతంగా తయారవుతుంది. నాటుకోడిని పసుపుతో శుభ్రం చేయడం వల్ల చికెన్ కర్రీకి మంచి రుచి, సువాసన వస్తాయని ప్రజలు నమ్ముతారు.
మనం సాధారణంగా కూరలు వండే సమయంలో మంచి రంగు కోసం పసుపు వేస్తుంటాం.. కానీ నాటుకోడి విషయంలో ఇది చాలా తొందరగా చేస్తాం. కోడిని కత్తిరించాక పసుపుతో శుభ్రం చేయడంతో ముక్కలు పసుపురంగులో ఆకర్షణీయంగా మారతాాయి… ఈ కూర కళ్లకు అందంగా కనిపిస్తుంది.
కోడిని కత్తిరించి శుభ్రం చేసే సమయంలో ఎలాంటి సూక్ష్మక్రిములు లేకుండా, మాంసం తాజాగా ఉండటానికి పసుపు సహాయపడుతుంది. అంతేకాకుండా కాల్చేటప్పుడు లేదా ఉడికించేటప్పుడు పసుపు రాయడం వల్ల వాసన మారి, రుచి కూడా మరింత పెరుగుతుందని జనాలు నమ్ముతారు.
55
బాగా కడిగి తింటే మంచిది
పల్లెటూళ్లలో నాటుకోడిని కోసి పసుపుతో శుభ్రం చేయడం ఒక ఆచారంలా కొనసాగుతోంది. పసుపులో ఉండే కర్కుమిన్ (Curcumin) శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పసుపు రాసినా, రాయకపోయినా కోడి మాంసాన్ని రెండుమూడుసార్లు బాగా కడిగి, పూర్తిగా ఉడికించి తినడమే ఆరోగ్యానికి మంచిది. చికెన్ ను శుభ్రంగా వండటమే కాదు కోడిని కూడా అంతే శుభ్రంగా కత్తిరించడం ఆరోగ్యానికి మంచిది.