ఏదైనా మంచి పని.. లేదా శుభకార్యానికి వెళ్లేటప్పుడు.. పెరుగులో పంచదార కలుపుకొని తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీనిని చాలా సంవత్సరాలుగా అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే.. అలా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలీదు కానీ.. పరగడుపున తింటే మాత్రం చాలా లాభాలున్నాయట.
undefined
ఉదయాన్నే పరగడుపున పెరుగులో ఒక స్పూన్ పంచదార కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఫిజికల్ , సైకలాజికల్ గా ఇలా తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుందట.
undefined
పెరుగులో కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ బి2, మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు చాలా ఉన్నాయి.
undefined
పెరుగులో పంచదార కలుపుకొని పరగడుపున తినడం వల్ల అరుగుదల సమస్యను పరిష్కరిస్తుంది. కడుపులో నొప్పి లాంటివి రాకుండా ఉంటాయట. ముఖ్యంగా ఎండాకాలం తినడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయట.
undefined
బయటకు వెళ్లే సమయంలోనూ పెరుగు, పంచదార తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడ గ్లూకోజ్ అందుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది.
undefined
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దానిని తినడం వల్ల అరుగుదల సమస్యలు తగ్గుతాయి. జీర్ణం సరిగా అవుతుంది.
undefined
పెరుగు తినడం వల్ల బ్లాడర్ కూల్ గా ఉంటుంది. దీని వల్ల మూత్ర సమస్యలు రావడం.. వేడి చేయడం లాంటివి కూడా ఉండవు. నీరు తక్కువగా తాగే వారు.. పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతాయి.
undefined
అయితే.. పెరుగు, పంచదార మిశ్రమాన్ని ఉదయం పూట మాత్రమే తీసుకోవాలట. అలా తీసుకోవడం ఆ రోజు మొత్తం శరీరానికి కావాల్సిన ఎనర్జీ అందుతుంది.
undefined