గుమ్మడితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ ఇలా తింటేనే....

First Published | May 20, 2021, 1:35 PM IST

ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. దీంతో అంతిమంగా బాడీ షేప్ అవుట్ అవ్వడం,  బరువు పెరగడం కనిపిస్తుంది. 

ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. దీంతో అంతిమంగా బాడీ షేప్ అవుట్ అవ్వడం, బరువు పెరగడం కనిపిస్తుంది.
undefined
అయితే ఇలాంటి సమస్యలతో బరువు పెరిగిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఒంట్లోని కొవ్వును తొలగించుకోలేకపోతారు. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కా ఇది.
undefined

Latest Videos


అదే గుమ్మడికాయ. ఆహారంలో గుమ్మడికాయను చేర్చడంవల్ల శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు.
undefined
అయితే గుమ్మడికాయ కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బాగా గింజలు ఉన్న గుమ్మడికాయలో ఈ సుగుణాలు ఉంటాయి.
undefined
అయితే చాలామంది ఈ గింజలను పడేస్తుంటారు. కానీ ఇవే ఆరోగ్యానికి ఎంతో మంచివి.
undefined
గుమ్మడికాయ గింజల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా ఆహారంలో చేర్చాలి.
undefined
తరచుగా శరీరం నిస్సత్తువగా, అలిసిపోయినట్టుగా అనిపిస్తున్నట్లైతే గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చండి. వీటివల్ల శరీరానికి 5 నుండి 600 క్యాలరీల శక్తి అందుతుంది.
undefined
గుమ్మడికాయ గింజల్లో ఉండే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎముకల బలానికి తోడ్పడతాయి.
undefined
గుమ్మడికాయ గింజలు రక్తంలోని చెడు కొలెస్టరాల్ ను తొలగిస్తాయి. అధిక రక్త పోటును తగ్గిస్తుంది.
undefined
నిద్రలేమితో బాధపడేవారికి, ఈ గింజల్లోని సుగుణాలు నరాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
undefined
శరీరంలోని ప్రొటీన్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూసుకుంటే మీ శరీరంలోని ప్రొటీన్ బ్యాలెన్స్ అవుతుంది.
undefined
శరీరం ఫిట్ గా ఉండాలంటే మీ డైట్ లో గుమ్మడికాయను, గింజలను చేర్చాలని చాలామంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
undefined
అయితే గుమ్మడికాయ తిన్నా ప్రయోజనాలు చేకూరడం లేదంటే.. మీరు ఖచ్చితంగా గింజల్ని వదిలేస్తున్నారని అర్థం. కాబట్టి గుమ్మడి గింజల్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చి.. అద్భుతాలు చూడండి.
undefined
click me!